ఆంధ్రప్రదేశ్‌

ఇసుక రీచ్ వద్దకు నేనే వస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 1: పరిష్కారవేదిక 1100 ప్రజలకు ఒక పదునైన ఆయుధమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం తన నివాసం నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు, బెల్ట్‌షాపుల నియంత్రణపై జిల్లాల కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా చేసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అన్ని రీచ్‌ల వద్ద పకడ్బందీగా నిఘా పెట్టామని, తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఏ స్థాయివారినైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు నిర్మించుకుంటున్నవారు, మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ తీసుకున్నవారు, క్రెడాయ్ వంటి సంస్థల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నామన్నారు. ఇసుక కొనుగోళ్లపై సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది కాల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న విషయం గుర్తుచేశారు. ఆ సమాచారాన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు పంపుతున్నామన్నారు. ఇసుక, మద్యం సమస్యలు తక్షణమే పరిష్కారం కావాలి, పూర్తిగా ప్రక్షాళన జరగాలి. రాజీపడే ప్రసక్తే లేదని, ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. మీరు చేయలేకపోతే నేనే రంగంలోకి దిగుతా, రీచ్‌ల వద్దకొచ్చి నేనే చర్యలు తీసుకుంటానని అధికారులకు చంద్రబాబు కఠినంగా హెచ్చరించారు. ఏ రీచ్ వద్ద ఏ బండిలో ఎంత ఇసుక వెళ్తుందో బండి నెంబర్‌తో సహా ట్యాబ్‌లలో నమోదు చేయాలని ఆదేశించారు. కొనుగోలుదారులు ఎదుర్కొన్న ఇబ్బందులను కాల్‌సెంటర్ ద్వారా అడిగి తెలుసుకోవాలి. ఆ సమాచారాన్ని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపాలి. కైజాలా యాప్‌లో శాండ్ టాస్క్ఫోర్స్ గ్రూప్ సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్, ఎస్సీ ఈ గ్రూప్‌లో కచ్చితంగా ఉండాలి. అభిప్రాయ సేకరణలో ఇసుక కొనుగోలు తేదీని కూడా అడగాలని ఆదేశించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క బెల్ట్‌షాప్ కూడా ఉండటానికి వీల్లేదు. వీధి, వీధి గాలించాలి, అణువణువూ తనిఖీ చేయాలి. ద్విచక్ర వాహనాల ద్వారా రవాణా, అమ్మకాలు చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలి. తమ బజారులో, తమ ఇంటి వద్ద బెల్ట్‌షాపు ఉందని ఏ మహిళా కాల్‌సెంటర్‌కు ఒక్క ఫిర్యాదు కూడా చేసే పరిస్థితి ఉండకూడదన్నారు. బెల్ట్ షాపులకు సంబంధించి ఇప్పటివరకు 3,165 కేసులు పెట్టామని, 3,422 మందిని అరెస్ట్ చేశామని, 13,436 లీటర్ల మద్యం, 98 వాహనాలు సీజ్ చేశామని, 108 ఏ 4 దుకాణాల లైసెన్స్‌లను సస్పెండ్ చేశామని ఎక్సైజ్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏదైనా సరే ఉన్నదున్నట్లుగా ప్రజలు మాట్లాడతారని, ప్రజాభిప్రాయానిదే ప్రజాస్వామ్యంలో అంతిమ వాక్కుగా పేర్కొన్నారు. తప్పుచేసినవారిని శిక్షించడంలో ఉపేక్షించకండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలతో అన్నారు. సుస్థిర ఆర్థికాభివృద్ధి, పారదర్శక పాలన రాజకీయ సుస్థిరత్వానికి సోపానాలుగా చంద్రబాబు పేర్కొన్నారు. రెండంకెల వృద్ధి, పారిశ్రామిక పురోగతి, జలవనరుల అభివృద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతి కేవలం మూడేళ్లలోనే సాధించామని గుర్తుచేశారు. టెలికాన్ఫరెన్స్‌లో రియల్ గవర్నెన్స్, మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్, ఆర్ధిక శాఖల అధికారులు అహ్మద్ ఆబు, శ్రీ్ధర్, లక్ష్మీనరసింహం, కాకి సునీత, వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.