ఆంధ్రప్రదేశ్‌

బాబు బక్రీద్ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 1: దైవ ప్రవక్త అజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే ఈద్-ఉల్-జహా (బక్రీద్) పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ త్యాగ స్మరణను పురస్కరించుకుని ఈర్ష్య, అసూయా ద్వేషాలకు అతీతంగా త్యాగమయ సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రజలందరం పునరంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో పేదరికం, దారిద్య్రంతో బాధపడుతున్న లక్షలాది ప్రజల సముద్ధరణకు ఈ సందర్భంగా మనమంతా కలిసి కృషి చేద్దామని ఆయన కోరారు.
స్పీకర్ కోడెల..
ముస్లిం సోదరులకు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఓ ప్రకటనలో బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదర, సోదరీమణులు చేసే దైవ ప్రార్థనలు మత సామరస్యానికి, సోదర భావానికి, సుఖశాంతులకు, మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని, శాంతి, సహనాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
మంత్రులు...
త్యాగానికి గుర్తుగా నిర్వహించుకునే బక్రీద్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారా లోకేష్, ఆదినారాయణరెడ్డి, శిద్ధా రాఘవరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ, అఖిల ప్రియ శుభాకాంక్షలు తెలిపారు.