ఆంధ్రప్రదేశ్‌

సిఆర్‌డిఏ నోటిఫికేషన్లను తోసిపుచ్చిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: ఆంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో పది గ్రామాల్లో భూ సేకరణకు సంబంధించి సిఆర్‌డిఏ జారీ చేసిన నోటిఫికేషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. వంద మంది రైతుల అభ్యంతరాలను తాజాగా స్వీకరించాలని హైకోర్టు సిఆర్‌డిఏ అధికారులను ఆదేశించింది. జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సిఆర్‌డిఏ తుది డిక్లరేషన్లు ప్రకటించే ముందు రైతుల అభ్యంతరాలను స్వీకరించలేదని కోర్టు పేర్కొంది.
అర్చకులకు బయోమెట్రిక్‌పై కోర్టులో పిటిషన్
దేవాలయ అర్చకులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్‌ను ప్రవేశపెట్టాలని దేవాదాయ శాఖ జారీ చేసిన ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య హైకోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించినట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు తెలిపారు. ఈ నెల 19వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు దేవాదాయ శాఖను ఆదేశించినట్లు వారు చెప్పారు. కాని అక్టోబర్ 1వ తేదీ తర్వాత కాని బయోమెట్రిక్‌ను ప్రవేశపెట్టమని దేవాదాయశాఖ కోర్టుకు తెలిపినట్లు వారు చెప్పారు.