ఆంధ్రప్రదేశ్‌

వినూత్నంగా ఆనంద లహరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 1: తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా, నేటి యువతకు మార్గనిర్దేశకత్వం చూపగలిగేలా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆనంద లహరి పేరిట వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసిందని ఆ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ నెల మూడవ తేదీన రాష్ట్రావ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ విశేష కార్యక్రమం జరగనుందని శుక్రవారం తెలిపారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ విజయభాస్కర్ ఈ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తారని, తొలిదశలో పైలెట్ ప్రాజెక్టుగా జిల్లా ముఖ్య కేంద్రాలలోని పురపాలక సంఘాలలోనే చేపడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆలోచనలు, ఆకాంక్షల మేరకు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని, నేటి యువతను తెలుగుదనానికి దగ్గర చేయటమే కార్యక్రమ కీలక ఉద్దేశ్యమని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. కార్యక్రమ నిర్వహణలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సహకారం తీసుకుంటున్నామని, స్థానికంగా అక్కడి మున్సిపల్ కమీషనర్లు ఆనంద లహరి వేడుకకు బాధ్యత తీసుకుంటారన్నారు. ఆనంద లహరి నిర్వహించే 13 ప్రాంతాలకూ సాంస్కృతిక శాఖ ఇప్పటికే కళా బృందాలను కేటాయించిందని, కనీసం నాలుగు గంటలకు తగ్గకుండా కార్యక్రమాలు ఉంటాయన్నారు. నిపుణులైన కళాకారులతో పాటు ఔత్సాహికులకు కూడా ఈ ప్రదర్శనలలో అవకాశం కల్పిస్తామని, ప్రధానంగా విద్యార్థులు, యువత తమ వంతు భూమికను పోషించాలన్నదే కార్యక్రమ ముఖ్యోద్దేశ్యమని మీనా స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలను పారద్రోలేలా ప్రత్యేకంగా రూపుదిద్దిన అంశాలను వీక్షకులకు అందిస్తారన్నారు. చిన్నారులు బడికి వెల్లవలసిన ఆవశ్యకత మొదలు మహిళా శక్తి, బాల్యవివాహాల నిర్మూలన, వరకట్న పిశాచిని అంతం చేయటం, కుల రక్కసిని విడనాడటం, మద్యం, మత్తులకు దూరంగా ఉండటం వంటి అంశాలపై రూపొందించిన ప్రదర్శనలు ఉంటాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు నగరలతో పాటు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గోదావరి జిల్లాల నుండి కాకినాడ, ఏలూరులలో ఆనంద లహరి చేపడతామన్నారు.
స్థానిక యువతకు ఈ ఆనంద లహరి కార్యక్రమంలో ప్రత్యేక అవకాశాలు ఉంటాయని, వారు తమ సహజసిద్ధమైన నిపుణతను ఈ వేదిక ద్వారా ప్రదర్శించవచ్చని మీనా తెలిపారు. వారిలో నిబిడీకృతమయి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేలా కార్యక్రమ రూపకల్పన జరిగిందని, వారు పెయింటింగ్, సంగీతం, నృత్యం వంటి అంశాలతో పాటు క్రీడా వికాసానికి దోహదం చేసే అంశాలను కూడా ఆనందలహరిలో ప్రదర్శించి ఆహూతుల మెప్పును పొందవచ్చన్నారు.