ఆంధ్రప్రదేశ్‌

రొయ్యల సాగులో యాంటీబయోటిక్స్ తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) సెప్టెంబర్ 1: ఆక్వా రంగంలో రాష్ట్రం నుంచి ఏటా 37 వేల కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయని, అలాంటి పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై వుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆక్వా రంగంలో యాంటీబయోటిక్స్ వినియోగంపై శుక్రవారం విజయవాడలోని ఎన్‌టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్వా రంగంలో వాడకూడని యాంటిబయోటిక్స్ వినియోగించటం వల్ల ఆరోగ్య పరంగా ఇబ్బందులు వస్తున్నాయన్నారు. దీంతో ఆక్వా రంగంపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. నిషేధించిన క్లోరామ్ ఫెనికాల్, నైట్రో ప్యూ రాన్స్ లాంటివి రొయ్యల సాగులో వాడుతున్నారని దీంతో అవి తిన్నవారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పా రు. ఇవి ఎగుమతులు చేసిన దేశాలు కంటైనర్స్ వెనుకకు పంపితే దేశానికి, రాష్ట్రానికి చెడ్డపేరుతో పాటు, నష్టం వస్తుందన్నారు. రాష్ట్రం ఆక్వా రంగంలో దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో రెండో స్థానంలో వుందని (40-45 శాతం) తెలిపారు. యాంటీబయోటిక్స్ వాడకం గురించి 9 మందితో టాస్స్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ టాస్క్ఫోర్స్ నెల రోజుల లోపు నివేదిక ఇచ్చే అవకాశాలు వున్నాయన్నార. టాస్క్ఫోర్స్‌లో డ్రగ్స్ డిజి, హేచరీస్, రైతులు, వ్యాపారులు, తదితరులు కన్వీనర్, కోకన్వీనర్, సభ్యులుగా వుంటారన్నారు. సాధారణంగా యాంటీబయోటిక్స్ అవశేషాలు 15 రోజు లు రోయ్యలలో వుండి తరువాత వాటిలో కనిపించవన్నారు. కొన్ని రకాల యాంటీబయోటిక్స్ రొయ్యలలో నెలల తరబడి వుంటాయన్నా రు. రొయ్యలకు వాడే మం దులు షాపుల వారీగా డ్రగ్స్ డిజి నుంచే లైసెన్స్ తీసుకోవలన్నారు. ల్యాబ్ అనుమతి కూడా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వున్న ల్యాబ్‌లో మైక్రోలెవల్స్‌లో పరీక్షిస్తుందని తెలిపారు. లైసెన్స్‌లు లేని షాపుల ద్వారా ఆక్వా రైతులు మందులు వాడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమను 50 వేల కోట్ల రూపాయలకు తీసుకెళ్ళడమే లక్ష్యంగా సి.ఎం. కృషి చేస్తున్నారన్నారు. ఈ రంగంపై 20 లక్షల మంది వరకు ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. అనుమతులు లేని ల్యాబ్స్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి అనధికారికంగా రొయ్యలు తీసుకొచ్చి మన ప్రాంతంలో అమ్ముతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కల్తీపై ప్రభుత్వం సీరియస్‌గా వుందని, ఎక్కడ కల్తీకి సంబంధించిన సమాచారం తెలియపరిచినా చర్యలు తీసుకుంటామన్నారు.

చిత్రం..ఆక్వా రంగంలో యాంటీబయోటిక్స్ వాడకంపై సమీక్షిస్తున్న మంత్రి కామినేని శ్రీనివాస్