ఆంధ్రప్రదేశ్‌

మోరి స్ఫూర్తితో రాష్ట్రంలో 400 స్మార్ట్ గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, సెప్టెంబర్ 1: ప్రధాని మోదీ ప్రపంచానికే వైబ్రేషన్స్ తీసుకువస్తుంటే స్మార్ట్ విలేజ్‌గా ఎంపికైన మోరి భారత దేశానికి వైబ్రేషన్స్ తెస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి రామాంజనేయులు అన్నారు. మోరి స్ఫూర్తిగా రాష్ట్రంలో మరో 425 గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా అభివృద్ధిచేయడానికి ముఖ్యమంత్రి ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని స్మార్ట్ విలేజ్ మోరిలో శుక్రవారం స్మార్ట్ విలేజ్‌లపై జరిగిన అవగాహనా సదస్సులో రామాంజనేయులు మాట్లాడారు. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం నెలకు రూ.10వేలు ఆదాయం పొం దాలనే ఆశయంతో చంద్రబాబు స్మార్ట్ విలేజ్ పథకాన్ని ప్రారంభించారని, అది మోరి గ్రామం నుంచే ప్రారంభమైందన్నారు. ముఖ్యమం త్రి నేతృత్వంలో ఐటి శాఖ మంత్రి లోకేష్ సెవెన్‌స్టార్ పథకంతో గ్రామా ల అభివృద్ధికి నడుం బిగించారన్నా రు. ఈ పథకానికి సాల్మన్ డార్విన్, యుసి బర్కిల్, కెఎల్ విశ్వవిద్యాల యం తమవంతు సహకారం అందజేస్తున్నాయన్నారు.
ప్రాజెక్టు ఇండియా, యుసి బర్కి లీ సంయుక్త ఆధ్వర్యంలో మోరి రివర్ సైడ్ స్కూల్ ఆవరణలో ఈ సదస్సు జరిగింది. ప్రాజెక్టు ఇండి యా డైరెక్టర్ ప్రొఫెసర్ సాల్మన్ డార్విన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సదస్సులో అమెరికన్ అంబాసిడర్ వెంకటేశన్, నాసా డైరెక్టర్ జోసఫ్ మినర్వా ఇరుదేశాల జాతీయ జెండాలను మార్చుకుని తమ సంఘీభావాన్ని చాటారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తయారుచేసిన శాటిలైట్ మోడల్‌ను నాసా డైరెక్టర్ జోసఫ్ మినర్వా ఆవిష్కరించారు.
జోసఫ్ మినర్వా మాట్లాడుతూ ఈ కుగ్రామంలో ఉన్న విద్యార్థులు రాకెట్ నమూనాలను తయారుచేయడం అభినందనీయమన్నారు. ఈ నమూనాలు తయారుచేసిన విద్యార్థులు దీప్తి, సాయిని యుఎస్‌ఎలోని నాసా కేంద్రాన్ని చూపించడానికి తమ వెంట తీసుకువెళ్లతామన్నారు.