ఆంధ్రప్రదేశ్‌

నదుల్లో కాలుష్యాన్ని నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(జగదాంబ), సెప్టెంబర్ 1: నదీ జలాల పరిరక్షణ, నదుల్లో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ(సత్య) డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసాన్ని తక్షణమే మార్చుకోవాలన్నారు. నదీ స్థలాన్ని ఆక్రమించి చంద్రబాబు ఇల్లు కట్టుకున్నారన్నారు. నది మధ్యలో ఇల్లు కట్టుకోవడం సరికాదన్నారు. నదికి కిలోమీటరు దూరంగా ఇల్లు నిర్మించుకుని నివశించాలన్నారు. ఈ విషయమై పర్యావరణ, వ్యవసాయ రంగ నిపుణులు స్వామినాథన్ హెచ్చరించినప్పటికీ చంద్రబాబు వాటిని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు నదుల పరిరక్షణ కోసం రివర్ ర్యాలీ చేపడుతున్న ఆథ్యాత్మికవేత్త జగ్గీవాసుదేవన్ చేస్తున్న ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ చంద్రబాబు తన నివాసాన్ని మార్చుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందిస్తున్న నదుల స్థితిగతులపై నీటిపారుదల రంగం నిపుణులు డాక్టర్ రాజేంద్రసింగ్, విక్రమ్ సోనీ వంటి ప్రముఖులతో కలసి పర్యటించినట్టు ఆయన పేర్కొన్నారు. తమ అధ్యయనయాత్రలో నదులు అత్యంత దారుణమైన దుస్థితిలో ఉన్నాయని గుర్తించామన్నారు.