ఆంధ్రప్రదేశ్‌

భార్య అక్రమ సంబంధంతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతసాగరం, సెప్టెంబర్ 1: భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమె ద్వారా కన్న బిడ్డల్ని కూడా అంతమొందించాడో కసాయి భర్త. శుక్రవారం సాయంత్రం నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడు గ్రామ గిరిజనకాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెంది న పెంచలప్రసాద్ మరింత సంపాదించడానికి కువైట్ దేశానికి వెళ్లాడు. ప్రసాద్ తిరిగి వచ్చేలోగా భార్య భాను మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. భర్త రాకను తెలుసుకున్న ఆమె ప్రియుడితో కలసి పరారైంది. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన భర్త ప్రసాద్ తనకు ఆమె వల్ల కలిగిన ముగ్గురు సంతానాన్ని హతమార్చదలిచాడు. పథకం ప్రకారం తన కుమార్తెలు హరిత, కీర్తి అనే చిన్నారులకు పురుగుల మందును బలవంతంగా తాగించి బావిలోకి తోసేశాడు. ఇద్ద రూ విగత జీవులయ్యారు. అనంతరం మూడో బిడ్డ పట్ల కూడా అలాగే వ్యవహరించే సమయానికి అరుపులు, కేకలు విన్న స్థానికులు ప్రసాద్‌ను అడ్డుకున్నారు. మూడో బిడ్డను ప్రాణాలతో కాపాడగలిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.