ఆంధ్రప్రదేశ్‌

నలుగురు ఐపిఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 1: రాష్ట్రంలో నలుగురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం నార్త్ కోస్టల్ జోన్ ఐజిగా పని చేస్తున్న కుమార్ విశ్వజిత్‌ను ఆర్గనైజేషన్ అండ్ కో ఆర్డినేషన్ ఐజిగా బదిలీ చేశారు. కాగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తు వెయిటింగ్‌లో ఉన్న ఎన్ శ్రీ్ధరరావుకు పర్సనల్ ఐజిగా బాధ్యతలు అప్పగించారు. ఇక ఇప్పటికే పర్సనల్ అదనపు డిజిపిగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అంజనాసిన్హాను రిలీవ్ చేస్తూ తదుపరి పోస్టింగ్ ఇచ్చేవరకు డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా విజయనగరం ఏపిఎస్‌పి ఐదో బెటాలియన్ కమాండెంట్‌గా పని చేస్తున్న కె కోటేశ్వరరావును ఎస్‌ఐబి ఎస్పీగా నియమించారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.