ఆంధ్రప్రదేశ్‌

ఏసిబికి చికి కన ఇద్దరు ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట/మాడుగుల, సెప్టెంబర్ 1: అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దొరికి పోయారు. తూర్పుగోదావరిలో ఫైర్ ఆఫీసర్, విశాఖ జిల్లాలో ఓ జూనియర్ అసిస్టెంట్ ఏసిబికి చిక్కారు. ప్రైవేటు ఆసుపత్రి భవనానికి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఒసి) రెన్యువల్‌కు ఒక వైద్యుడి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట అగ్నిమాపక శాఖాధికారి సిహెచ్ నాగేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి రాజమహేంద్రవరం డిఎస్పీ ఎం సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం రావులపాలెం మండలం రావులపాడులోని విజయా నర్శింగ్ హోమ్‌కు చెందిన కంటి వైద్యనిపుణుడు పెనె్మత్స సుధాకర్ తన ఆసుపత్రి జి ప్లస్ 3కి 2016లో అగ్నిమాపక శాఖ ద్వారా ఎన్‌ఒసి తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ఎన్‌ఒసి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉండటంతో దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌ఒసి రెన్యువల్ నిమిత్తం కొత్తపేట ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు, ఇన్‌ఛార్జి డిఎఫ్‌ఒ కెవి త్రినాథ్‌ప్రసాద్ ఆకస్మికంగా ఆసుపత్రిని తనిఖీచేశారు. అనంతరం ఎన్‌ఒసి రెన్యూవల్ కోసం రూ.50వేలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో ఇన్‌ఛార్జి డిఎఫ్‌ఒకు రూ.40వేలు, కొత్తపేట ఫైర్ ఆఫీసర్‌కు రూ.10వేలు ఇవ్వాలని డిమాండుచేసినట్లు డాక్టర్ సుధాకర్ తమకు ఫిర్యాదు చేశారని ఎసిబి డిఎస్పీ తెలిపారు. దీనితో ఎసిబి అధికార్లు వలపన్నారు. శుక్రవారం కొత్తపేట ఫైర్ స్టేషన్‌లోని తన కార్యాలయంలో డాక్టర్ సుధాకర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. ఈ వ్యవహారంలో కాకినాడ ఇన్‌ఛార్జి డిఎఫ్‌ఒ ప్రసాద్‌ను కూడా విచారిస్తున్నామని ఎసిబి డిఎస్పీ సుధాకర్ విలేఖర్లకు తెలిపారు. ఈ దాడిలో ఎసిబి ఇన్‌స్పెక్టర్ పి మోహనరావు, డిసిటిఒ కృష్ణ, తాతాజీలు పాల్గొన్నారు. తీసుకున్న నగదుతో తనకు సంబంధం లేదని ఇన్‌ఛార్జి డిఎఫ్‌ఒ ప్రసాద్ తీసుకోమంటేనే తీసుకున్నానని ఎసిబికి చిక్కిన కొత్తపేట ఫైర్ ఆఫీసర్ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు.
కాగా విశాఖ జిల్లా మాడుగుల సబ్ ట్రైజరీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.జగన్నాథరావు లంచం తీసుకుంటూ ఎసిబికి శుక్రవారం దొరికిపోయాడు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల బిల్లులు మంజూరు చేసేందుకు 20 వేల రూపాయల లంచం డిమాండ్ చేసిన జగన్నాథరావు ఆ మేరకు సొమ్ము తీసుకుంటుండగా ఎసిబికి చిక్కాడు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద సుమారు పది లక్షల రూపాయల విలువ గల పనులను చేపట్టి ఇందుకు సంబంధించిన బిల్లులను మాడుగుల సబ్ ట్రైజరీ కార్యాలయానికి పంపించారు. అయితే పది లక్షల రూపాయల బిల్లులు మంజూరు చేయడానికి రెండు శాతం అంటే 20 వేల రూపాయల లంచం ఇవ్వాలని జగన్నాథరావు డిమాండ్ చేశాడు. దీంతో వడ్డాది పంచాయతీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వి.రాంజిగౌడ్ ఈ విషయంపై ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎసిబి డిఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు వ్యూహాత్మకంగా లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్‌ను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.