ఆంధ్రప్రదేశ్‌

రెండు చోట్లా అధికార దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 1: తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్కరికీ మేలుచేయదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్న జగన్ పులివెందుల కార్యకర్తలతో మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతోనే టిడిపి గెలిచిందన్నారు. అంతేతప్ప ప్రజాతీర్పుకాదన్నారు. కాబట్టి వైసిపి నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ ప్రభుత్వం వైసిపి సానుభూతిపరులు, కార్యకర్తలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించదన్నారు. కాబట్టి ప్రభుత్వ పథకాలు అందనంతమాత్రాన కలత చెందాల్సిన అవసరం లేదన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని అన్ని విధాల ఆదుకుంటానని ఆయన పేర్కొన్నారు. టిడిపి అవినీతి అక్రమాలను అడ్డుకోవాలన్నారు. రాజన్న పాలనలో జరిగిన అభివృద్ధి, టిడిపి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ఏమాత్రం పొంతనలేదన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడే ఏప్రభుత్వానికీ మనుగడ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు వైసిపి వెంటే ఉన్నారన్నారు. నవరత్నాల ద్వారా రాష్టన్రవతేజం అభివృద్ధి కొనసాగుతుందన్నారు. శనివారం జరుగనున్న దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి వేడుకల్లో జగన్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొంటారు.