ఆంధ్రప్రదేశ్‌

వాకపల్లి బాధితులకు న్యాయం జరిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 1: పదేళ్ల కిందట విశాఖ జిల్లా వాకపల్లి గ్రామంలో గిరిజన మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారం జరిపిన సంఘటన మళ్లీ తెరమీదకు వచ్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును విచారణ జరిపి తీరాల్సిందేనని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసు వర్గాల్లో కలకలం రేపింది 2007 ఆగస్టు 20న విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలోని వాకపల్లి గ్రామంలో 11 మంది ఆదివాసీ మహిళలపై 13 మంది గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై ఇప్పటివరకూ విచారణ జరగలేదు. ఈ అమానుష ఘటనపై దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని అనేక ప్రజా సంఘాలు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై పౌరహక్కుల సంఘాలు ఇప్పటికీ కోర్టుల్లో పోరాడుతునే ఉన్నాయి.
సర్వోన్నత న్యాయస్థానం ఎట్టకేలకు స్పందించి పై ఆదేశాలు జారీ చేసింది. విశాఖ ఏజెన్సీలో మావోయిస్ట్ కార్యకలాపాలు ఉద్ధృతంగా జరుగుతున్న నేపథ్యంలో గ్రేహౌండ్స్ బలగాలు 2006 నుంచి కూంబింగ్ ఆపరేషన్ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నాయి. మావోయిస్ట్‌ల జాడ కోసం పోలీసులు ఆదివాసీలను వేధింపులకు గురిచేశారు. 2007 ఆగస్టు 20వ తేదీ ఉదయం ఆరు గంటలకు 21 మంది గ్రేహౌండ్స్ పోలీసులు వాకపల్లి గ్రామంలో విధ్వంసం సృష్టించారు. మావోయిస్ట్‌లకు గిరిజన మహిళలు ఆశ్రయం కల్పిస్తున్నారన్న అనుమానంతో గ్రేహౌండ్స్ పోలీసులు గిరిజన తండాల్లోని ఇళ్ళలోకి చొరబడి విధ్వంసం సృష్టించి 11 మంది కోందు (పివిటిజి) ఆదివాసీ మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు పాడేరు సబ్ కలెక్టర్ కార్యాయలంలో 11 మంది మహిళలు ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు పాడేరు పోలీసులు ఐపిసి సెక్షన్ 372(2), సెక్షన్ 3(2) ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అదే రోజు సాయంత్రం డిజిపి బాసిత్ మాట్లాడుతూ వాకపల్లి మహిళల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. అటువంటి ఘటనే జరగలేదని, కూంబింగ్‌ను నిలిపివేయడానికి మావోయిస్ట్‌లు చేస్తున్న ఆరోపణలు అతను పేర్కొన్నారు. అప్పటి హోం మంత్రి జానారెడ్డి కూడా అత్యాచార సంఘటన జరగలేదని కొట్టిపారేశారు. అదే రోజు రాత్రి 10 గంటలకు బాధిత మహిళలను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కెజిహెచ్‌కు తరలించారు. మర్నాడు వైద్య పరీక్షలు జరిపారు. వాకపల్లి ఘటనకు బాధ్యులైన గ్రేహౌండ్స్ పోలీసులను అరెస్ట్ చేయాలని కలెక్టరేట్ వద్ద అప్పటి చింతపల్లి ఎమ్మెల్యే దేముడు, పాడేరు ఎమ్మెల్యే రాజారావు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆగస్టు 22న అప్పటి జిల్లా ఎస్పీ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ 21 మంది గ్రేహౌండ్స్ పొలీసులను పిలిపించి, విడివిగా విచారించానని, వాకపల్లిలో అత్యాచార ఘటనే జరగలేదని ప్రకటించారు. అదే రోజు ఏజెన్సీ బంద్‌కు కాంగ్రెసేతర పార్టీలన్నీ పిలుపునిచ్చాయి. ఆగస్టు 23న పాడేరు సబ్ కలెక్టర్ వాకపల్లి గ్రామానికి వెళ్లి, మహిళలను కలిసి గేదెల రుణాలు, ఇతర ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
అప్పటి నుంచి ఈ సంఘటనను భూస్థాపితం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తునే వచ్చింది. కానీ దీనిపై శుక్రవారం సుప్రీం కోర్టు స్పందించింది. ఈ కేసు విచారణలో అపరమితమైన ఆలస్యం జరిగినందుకు కోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది గ్రేహౌండ్స్ పోలీసులపై విచారణ జరిపి తీరాలని ఆదేశించింది. కేసులో జాప్యం వలన ఆదివాసీ మహిళలకు క్రిమినల్ న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ శాంతానాగౌండర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై పోలీసులు వేసిన క్వాష్ పిటిషన్‌ను శుక్రవారం కొట్టివేసింది. సంబంధిత ట్రయల్ కోర్టు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఆదివాసి, గిరిజన, ప్రజా సంఘాల్లో హర్షం వ్యక్తమవుతోంది. దర్యాప్తుతో పూర్తి న్యాయం జరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

చిత్రం..పాడేరులో అప్పట్లో ధర్నా చేసిన గిరిజన మహిళలు