ఆంధ్రప్రదేశ్‌

మిలీనియం మార్చ్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 1: తమ పాలిట శాపంలా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)ను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల మిలీనియం మార్చ్‌తో శుక్రవారం విజయవాడ వీధులు దద్దరిల్లాయ. తరువాత బిషప్ అజరయ్య హైస్కూలు ప్రాంగణంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సిపిఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామాంజనేయులు యాదవ్, జెఏసి అమరావతి చైర్మన్, ఏపి రెవన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపి జెఎసి చైర్మన్, ఎన్‌జివో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ సిపిఎస్ రద్దుకు సిఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు. తన పలుకుబడిని ఉప పూర్తిగా వినియోగించాలని కోరారు. పాత పెన్షన్ విధానంలో మాదిరిగా ఈ సిపిఎస్ విధానంలో నిర్ణీత మొత్తంలో పెన్షన్ వస్తుందనే గ్యారంటీ లేదన్నారు. స్టాక్ మార్కెట్‌లు దెబ్బతింటే వచ్చే పెన్షన్ తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోరాటాలు, విజ్ఞప్తుల వల్ల ఇటీవల సిఎం చంద్రబాబు స్పందించి ఉద్యోగి మరణానంతరం తమ కుటుంబానికి పెన్షన్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపారని అయితే 30 ఏళ్లు సర్వీస్‌చేసి రిటైర్ అయినవారికి మాత్రం పెన్షన్ భద్రత లేకపోతే ఎలాఅని ప్రశ్నించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథార్టీ దీన్ని అమలు చేస్తుండగా నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ రికార్డు నిర్వహణ చూస్తోందన్నారు. పాత పెన్షన్ విధానంలో ఒక్క రూపాయి కూడా ఉద్యోగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సిపిఎస్ విధానంలో ప్రతి ఉద్యోగి తన బేసిక్, డిఏలలో పదిశాతం చొప్పున ప్రతినెలా జమ చేయాల్సి ఉంటుందని దీనికి ప్రభుత్వం మరో పది శాతం జమ చేస్తుందని అన్నారు. ఈ సొమ్ము మొత్తాన్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడతారన్నారు. దానిపై వచ్చే లాభనష్టాలపై ఆధారపడి రిటైర్ అయిన తర్వాత ఆ ఉద్యోగికి పెన్షన్ చెల్లిస్తారని చెప్పారు. అదే పాత పెన్షన్ విధానంలో రిటైర్డ్ అయిన సమయంలో ఉన్న జీతం ఆధారంగా పెన్షన్ లభించేదని పైగా పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెరుగుతుండేదని అన్నారు. శాసనమండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి, రాము సూర్యారావు, జి.శ్రీనివాసులునాయుడు, పివి మాధవ్ తమ తమ ప్రసంగాల్లో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం మండలిలో పోరాడతామని హామీ ఇచ్చారు.
కదంతొక్కిన ఉద్యోగులు
జెఏసి అమరావతిలో భాగస్వామ్యమైన రాష్ట్రంలోని లక్షా 70వేల మంది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపి సిపిఎస్ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు జరిగిన మిలీనియం మార్చ్‌లో దాదాపు 20వేల మంది పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో తరలివచ్చిన ఉద్యోగులు రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌ల నుంచి ప్లకార్డులు, బ్యానర్లు చేతబట్టుకుని పెద్దపెట్టున నినాదాలిస్తూ ముందుకు నడిచారు. ఈ సందర్భంగా నగర వీధులన్నీ నిండిపోయాయి.

చిత్రం..విజయవాడ నగరంలో ఉద్యోగ సంఘాల ప్రదర్శన