ఆంధ్రప్రదేశ్‌

రాష్టప్రతికి ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 1: రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు రేణిగుంట విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. భారత రాష్టప్రతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్ తొలిసారిగా తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసం ఢిల్లీ నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. అంతకుముందుగా ఉదయం 10 గంటలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని తిరిగి విమానాశ్రయానికి చేరుకోగా, 2.15 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో క్యాబినేట్ మంత్రులతో పాటు రేణిగుంటకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాష్టప్రతి రానుండటంతో విమానాశ్రయం విఐపి లాంజ్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కొంతసేపు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చర్చించుకున్నారు. అనంతరం 3 గంటలకు రాష్టప్రతి విమానం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా రాష్టప్రతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, అమరనాథరెడ్డి, నారా లోకేష్, అచ్చంనాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, ఎంపిలు శివప్రసాద్, కంభంపాటి రామ్మోహన్ రావు, సిఎం రమేష్, ఎమ్మెల్యేలు శంకర్, నారాయణ స్వామి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తలారి ఆదిత్య, సత్యప్రభ, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, చిత్తూరు మేయర్ కటారి హేమలత, జడ్పి చైర్మన్ గీర్వాణి, బిజెపి నాయకురాలు శాంతారెడ్డి, జిల్లా టిడిపి అధ్యక్షుడు నాని, రాష్ట్ర డిజిపి సాంబశివరావు, చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్న, డిఐజి జొన్నగడ్డ ప్రభాకర్, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతిలు రాష్టప్రతికి పుష్పగుచ్ఛాలిచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డుమార్గాన తిరుచానూరు అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. విమానాశ్రయ పరిసరాలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్టప్రతికి భారీ ఎత్తున స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.

చిత్రాలు..తిరుచానూరు అమ్మవారి ఆలయంలో రాష్టప్రతి కోవింద్ దంపతులు
*రేణిగుంట విమానాశ్రయంలో రాష్టప్రతికి స్వాగతం పలుకుతున్న గవర్నర్ నరసింహన్, పక్కన సిఎం చంద్రబాబు