ఆంధ్రప్రదేశ్‌

బాబు ఇంటి వద్ద విజయోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 1: కాకినాడలో పార్టీ తిరుగులేని మెజారిటీతో కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న తర్వాత టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో శుక్రవారం విజయోత్సాహాలు నిర్వహించారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనకు అభినందనలు చెప్పారు. అంతకుముందు.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మంత్రులు కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, ఎమ్మెల్సీలు టిడి జనార్దన్, వివివి చౌదరి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేషన్ చైర్మన్ జయరామిరెడ్డి, తదితరులకు స్వయంగా స్వీట్లు తినిపించారు. వారితో పాటు రెండు ఎన్నికల్లో పనిచేసిన కీలక నేతలకూ స్వీట్లు తినిపించారు. రెండు ఎన్నికల్లో తాను ఊహించిన ఫలితాలే వచ్చాయని, ఈ విజయాలు మన బాధ్యతను మరింత పెంచాయని, కొత్త వ్యూహాలతో వెళ్లాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు చాటాయని బాబు విశే్లషించారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుమీడియాతో మాట్లాడుతూ జగన్ రాజకీయ జీవితానికి ఈ రెండు ఫలితాలతో ముగింపు పలికినట్లేనని వ్యాఖ్యానించారు. ఇకనైనా ఆయనలో మార్పు వచ్చి, సద్విమర్శలతో ప్రభుత్వానికి సహకరిస్తే ప్రజల్లో విలువ ఉంటుందన్నారు. జగన్‌పై తాను గతంలో చెప్పిందే నిజమైందని, త్వరలో ఆ పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వస్తారని పుల్లారావు జోస్యం చెప్పారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ముద్రగడను కాపులు, బలిజలు నమ్మలేదన్న వాస్తవం కాకినాడ కార్పొరేషన్, నంద్యాల ఉప ఎన్నికలో స్పష్టమయిందని వ్యాఖ్యానించారు. జగన్ గడప గడప ఎక్కినా జగన్ ఆయనను నమ్మలేదన్నారు. విశ్వసనీయత లేని నేతలకు స్ధానం ఉండదని ఈ రెండు ఫలితాలు నిరూపించాయన్నారు.

చిత్రం..మంత్రులు ప్రత్తిపాటి, నారాయణ, కళావెంకట్రావుకు స్వీట్లు తినిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు