ఆంధ్రప్రదేశ్‌

కో-ఆర్డినేటర్ల తొలగింపు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 2: ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చెందిన జిల్లా, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు 175 మందిని తొలగించడం సరికాదని ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా లోతుగా విశే్లషణ చేసిన తరువాత, ప్రభుత్వ పథకాలను అందరికీ తెలియచేసేందుకు వీలుగా కో-ఆర్డినేటర్ల వ్యవస్థను రూపొందించినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వంపై భారం లేకుండా సభ్యత్వ నమోదు, పథకాల ప్రచారానికి ఈ వ్యవస్థ ఉపయోగపడిందని తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో ఈ వ్యవస్థ పనితీరును చూసి ఇతర సంక్షేమ శాఖల్లో అమలు చేశారని తెలిపారు. అటువంటి వ్యవస్థను ఎటువంటి కారణాలు చూపకుండా ఒకేసారి తొలగించడం సరికాదని విమర్శించారు. సరిగా పని చేయని వారిని గుర్తించి, ఆ స్థానాలను వేరేవారితో భర్తీ చేస్తే బాగుండేదని సూచించారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు గత ఆరు నెలులుగా పూర్తి స్థాయి మేనేజింగ్ డైరెక్టర్ లేరని తెలిపారు. దీని వల్ల చాణక్య పథకం సహా కొన్ని పథకాల అమల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. దీనిపై సిఎం దృష్టి సారించాల్సి ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.