ఆంధ్రప్రదేశ్‌

వైఎస్‌ఆర్ స్ఫూర్తితో కాంగ్రెస్ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 34 ఏళ్ల వయస్సులోనే నాడు ఎన్‌టిఆర్ ప్రభంజనాన్ని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే వైఎస్‌ఆర్‌కు నిజమైన నివాళి అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఎపిసిసి కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డితో కలిసి వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి కెవిపి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కెవిపి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల దృష్టిని ఆకట్టుకొని అతి చిన్న వయస్సులోనే పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ తరఫున వారసులు కాంగ్రెస్ శ్రేణులేనన్నారు. తన జీవితాంతం వరకూ కాంగ్రెస్ కోసమే పనిచేసిన ఆయన ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించటమే కాకుండా, ఆయా పథకాలు అమలుచేయాల్సిన ఆవశ్యకతను రాష్ట్రానికే కాక దేశానికే చాటారన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యమన్న వైఎస్‌ఆర్ నినాదంతో పార్టీకి మళ్లీ పునరుత్తేజం తీసుకురావాలని, రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయాలన్న వైఎస్ సంకల్పానికి నిజ రూపం తీసుకొచ్చి నిజమైన వారసులమవుదామన్నారు. ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జీవితంలో తన కోసం కాకుండా ప్రజల కోసమే పనిచేశారన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలే నేటి పాలకులకు దిక్కయినాయన్నారు. వాటి పేర్లయితే మారాయి కానీ లక్ష్యం మాత్రం ఒక్కటేనన్నారు. వైఎస్ చూపిన మార్గంలో పయనించి ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఎపి మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, పిసిసి ప్రధాన కార్యదర్శులు మీసాల రాజేశ్వరరావు, రాజీవ్త్రన్, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, తదితరులు పాల్గొన్నారు.