ఆంధ్రప్రదేశ్‌

ఇంటిలిజెన్స్ నివేదిక పేరుతో తప్పుడు కథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 2: నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఇంటిలిజెన్స్ నివేదిక పేరుతో ముందస్తు సర్వేను వెబ్‌సైట్‌లో ప్రచురించడాన్ని చట్ట వ్యతిరేకంగా భావిస్తూ నమోదైన కేసులో మన తెలంగాణా న్యూస్ ఎడిటల్ కూన అజయ్‌బాబు, మరో వ్యక్తిని నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఈనెల 23వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొంది ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికకు ముందు ముందస్తు సర్వేలు నిర్వహించరాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది కూడా. అయితే ఇందుకు భిన్నంగా ‘నేటి భారతం డాట్ కామ్’ తెలుగు న్యూస్ అనే వెబ్‌సైట్‌లో వచ్చిన ముందస్తు సర్వే ప్రకారం నంద్యాలలో వైసిపిదే పైచేయి అవుతుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ముందస్తు సర్వేల ప్రకారం.. ఉప ఎన్నికలో వైసిపి అభ్యర్థి 4,551 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని ప్రభుత్వ ఇంటిలిజెన్స్ నివేదిక చెబుతోందని, ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం లీకయినట్లు ఉటంకిస్తూ ఉప ఎన్నికకు ఒకరోజు ముందు ఆగస్టు 22వ తేదీన నేటి భారతం వెబ్‌సైట్, ఫేస్‌బుక్‌లో రాష్ట్ర ప్రభుత్వ లోగోతో సహా కథనం వెలువడింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, తప్పుడు కథనాలతో ప్రజలను మోసం చేయడమేనని ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు నంద్యాల మూడో పట్టణ పోలీస్టేషన్‌లో క్రైం నెంబర్ 193/2017 అండర్ సెక్షన్ 420, 468, 471 ఐపిసి అండ్ సెక్షన్ 126(1),(బి) ఆఫ్ ఆర్‌పి యాక్టు అండ్ సెక్షన్ 66సి, 66డి, ఆఫ్ ఐటి యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో హైదరాబాద్‌లోని నేటి భారతం అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న మన తెలంగాణా పత్రిక న్యూస్ ఎడిటర్ కూన అజయ్‌బాబు, వెబ్ డిజైనర్ డి రంజిత్‌కుమార్‌లను అరెస్టు చేశారు. పలు డాక్యుమెంట్లు, సిపియు స్వాధీనం చేసుకున్నారు.