ఆంధ్రప్రదేశ్‌

జీవో 64 రద్దుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 2: వ్యవసాయ శాఖ ప్రమాణాలకు పెను విఘాతంగా పరిణమించిన జీవో 64 రద్దుచేయాలని, వ్యవసాయశాఖలోని అన్ని రకాల ఉద్యోగాలను పోటీ పరీక్ష ద్వారా భర్తీ చేయాలని, అలాగే జీవో 16 యథాతథంగా అమలుచేసి వ్యవసాయ రంగాభివృద్ధికి చర్యలు చేపట్టవలసిందిగా కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఓ లేఖ రాశారు. జీవో నెం.64 రద్దు చేయాలని, వ్యవసాయ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని గత నెల రోజులుగా ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రామకృష్ణ ఈ లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొంది, అత్యున్నత వ్యవసాయ విద్యా ప్రమాణాలను పాటించేవారినే వ్యవసాయ శాఖాధికారులుగా నియమించేలా 2000వ సంవత్సరంలో జీవో 16 జారీ చేశారు. జీవో 16 ప్రకారం మన రాష్ట్రంలోని గుర్తింపు పొందిన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి లేదా ఐసిఎఆర్ గుర్తింపు పొందిన ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుండి బిఎస్సీ అగ్రికల్చర్ పట్టా పొందిన వారికే అవకాశముండేది. గత జూలై 27న జీవో 64 విడుదల చేసి అన్ని బిఎస్సీ అగ్రికల్చర్ పట్టాలకు ఒకే విలువని కల్పించిన కారణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందన్నారు. దీన్ని వ్యవసాయ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ జీవో వలన బిఎస్సీ అగ్రికల్చర్‌లో బోగస్ యూనివర్సిటీల ద్వారా నకిలీ సర్ట్ఫికెట్లు పొందినవారికి, దూరవిద్య ద్వారా పట్టా పొందినవారికి, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్‌గా చదువుకున్నవారికి ఏ మాత్రం తేడా లేకుండా పోతుందన్నారు.