ఆంధ్రప్రదేశ్‌

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 2: నూజివీడు ఐఐఐటిలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్‌జియుకెటి వైస్ ఛాన్సలర్‌ను శనివారం ఆయన ఆదేశించారు. విద్యా సంస్థలో ర్యాగింగ్ సంఘటనలు వెలుగుచూస్తున్నప్పటికీ ఎందుకు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాలయాల్లో ర్యాగింగ్ సంఘటనలను సహించేది లేదని, దోషులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధానికి పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ర్యాగింగ్ నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీలు క్రమం తప్పకుండా పనిచేయాలని సూచించారు.