ఆంధ్రప్రదేశ్‌

ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు రూ.466 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, సెప్టెంబర్ 2: శ్రీకాకుళం జిల్లాలో తలపెట్టిన ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి 466 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసిందని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను మీడియాకు శనివారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008లో అప్పటి సిఎం వైఎస్ ఎటువంటి జీవోలు విడుదల చేయకుండా ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసారని, అప్పట్లో 127 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని, దీంతో ఆఫ్‌షోర్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, 2014 ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం వచ్చాక మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో ఆఫ్‌షోర్ పనులు జోరందుకున్నాయన్నారు. ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌పై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ సమీక్ష సమావేశం నిర్వహించినప్పటికీ ఆ సమావేశంలో అధికారులు పూర్తిగా మంత్రిని తప్పుదోవ పట్టించారన్నారు.