ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కు జనమే బుద్ధి చెప్పారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 2: కులాల మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి పక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెప్పారని, ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధులకు జనం బ్రహ్మరథం పట్టడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నట్టు రుజువైందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని టిడిపి కార్యాలయంలో శనివారం ప్రత్తిపాటి విలేఖరులతో మాట్లాడారు. బాబు సంక్షేమ కార్యక్రమాలు, విధానాలకు కాకినాడ ప్రజలు పట్టం కట్టారన్నారు. సుమారు 30 సంవత్సరాల తర్వాత కాకినాడ కార్పొరేషన్‌లో టిడిపి విజ యం సాధించిందని, ఇక్కడి ప్రజలు ఆశ్చర్యపోయే రీతి లో నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం పన్నాగం కాకినాడలో పనిచేయలేదని, నంద్యాలలో కూడా వైసిపికి ఏమాత్రం అనుకూలించలేదని వ్యాఖ్యానించారు. కులాలు, ప్రాంతా ల మధ్య చిచ్చు రగిల్చేందు కు ఎన్ని కుట్రలు పన్నినా జనం పట్టించుకోకుండా సంక్షేమానికే పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. జగన్‌ను నమ్ముకుంటే తమకు భవిష్యత్ ఉండదని ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు పునరాలోచనలో పడ్డారని విమర్శించారు.