ఆంధ్రప్రదేశ్‌

చిన్నారిపై టీచర్ దాష్టీకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, సెప్టెంబర్ 2: విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఒక ప్రైవేటు స్కూల్లో విద్యార్థిపై ఆ స్కూల్ ఉపాధ్యాయురాలు దాడిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. తాడావారి వీధిలో ఉన్న దీప్తి స్కూల్లో రెండో తరగతి చదువుతున్న జె.తరుణ్ బుగ్గలపై పాఠశాల ఉపాధ్యాయురాలు లావణ్య చెప్పుతో కొట్టడంతో ఆ బాలుడి బుగ్గలు కందిపోయాయి. హోం వర్క్ డైరీలో తల్లిదండ్రుల సంతకం చేయించలేదన్న కారణంతో టీచర్ అమానుషంగా తరుణ్‌ను కొట్టిందని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి తరుణపై ఉపాధ్యాయురాలు కొట్టినట్లు తండ్రి రామకృష్ణ విలేఖర్లకు తెలిపారు. ఏడాదికి 10వేల రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నామన్నారు. దీంతోపాటు పుస్తకాలు, బ్యాగ్‌లు, యూనిఫారాలు, బూట్లు కోసం అదనంగా డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. డైరీలో తల్లిదండ్రుల సంతకం చేయించలేదన్న చిన్నకారణంలో విద్యార్థి ముఖంపై కొట్టి గాయపరచడం దారుణమని, ఆ ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని తండ్రి డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై వివరణ కోరేందుకు పాఠశాలకు వెళ్లగా సంబంధిత ఉపాధ్యాయులు, హెడ్‌మాస్టర్‌గాని అందుబాటులో లేరు.

చిత్రం..గాయాలపాలైన బాలుడిని చూపుతున్న తండ్రి రామకృష్ణ