ఆంధ్రప్రదేశ్‌

పదవులపై ఆశలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 2: ప్రపంచంలో భారత విమానయాన రంగం పదో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. శనివారం ఆయన దత్తత గ్రామమైన నెల్లిమర్ల మండలం సారిపల్లి వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ గత మూడేళ్లలో విమానయాన రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. అయి తే కేవలం ప్రయాణికులను తీసుకెళ్లడానికి ఎయిర్‌పోర్టులు ఉపయోగపడాలనే భావన కాకుండా కార్గోను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిర్ కార్గోను అభివృద్ధి చేస్తే రైతులు పండించిన పంటలను దూర ప్రాంతాలలో కూడా మార్కెట్ చేసుకునే వెసులు బాటు ఉంటుందన్నారు. ఇందుకు బెంగళూరు నుంచి పువ్వులు, కూరగాయలు, మాంసం వంటివి ఎగుమతి చేస్తున్నారని వివరించారు. నేడు రైతులు పండించే పంటలకు ప్రపంచంలో మంచి మార్కెట్ ఉందన్నారు. అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సి ఉందని వివరించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో విమానాశ్రయాల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామన్నారు. విజయవాడలో 800 ఎకరాల్లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగ రాజమండ్రి, కడపలో రన్‌వేలను విస్తరించామన్నారు. గతంలో కేవలం ప్రొపెల్లర్లు మాత్రమే ల్యాండ్ అయ్యేవని, నేడు జెట్ విమానాలు కూడా దిగే విధంగా రన్‌వేను అభివృద్ధి చేశామన్నారు. భోగాపురంలో వౌలిక వసతులు కల్పించడంతోపాటు మిలటరీ అవసరాలు, కార్గో అవసరాలు కూడా తీర్చేవిధంగా ఇక్కడ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. త్వరలో ప్రధాని మోదీ చేపట్టనున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో కీలకమైన పదవులు ఏమైనా ఆశిస్తున్నారా అని అడగ్గా తాను ఏ పదవులను ఆశించడం లేదన్నారు. రాజకీయాల్లో హెచ్చుతగ్గులు సాధారణమేనన్నారు. ఏ పదవి కట్టబెట్టాలన్నదీ నాయకులు చూసుకుంటారని బదులిచ్చారు. టిడిపి నుం చి బిజెపిలోకి మారే ఆలోచనపై విలేఖరుల ప్రశ్నకు తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం టిడిపిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
టిఆర్‌టిఎస్‌తో తాగునీరు రాదు
విజయనగరం జిల్లాలోని తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, విజయనగరం పట్టణ వాసుల దాహార్తిని తీర్చేందుకు 0.4 టిఎంసిల తాగునీరు అందించాలని గత ప్రభుత్వం ప్రాజెక్టుకు రూపకల్పన చేసినప్పటికీ ఆ ప్రాజెక్టు ద్వారా విజయనగరం వాసులకు చుక్కనీరు రాదని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు స్పష్టం చేశారు. దానిపై ప్రజలు అపోహలు పెంచుకోవద్దన్నారు. చంపావతి నదిలో నీరు లేకుండా తాగునీరు ఎలా ఇవ్వగలమని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో సాధ్యాసాధ్యాలు చూడకుండా ప్రాజెక్టుకు డిజైన్లు చేశారని, కనీసం ప్రజాభిప్రాయసేకరణ కూడా చేపట్టలేదని ఆయన విమర్శించారు. రూ.42 కోట్లు వెచ్చించి పైపులైన్లు వేశారని అవి ఎందుకు కొరగాకుండా ఉండిపోయాయన్నారు. ఇపుడు వాటిలో ఎలుకలు నివాసం ఉండటానికి ఉపయోగపడుతున్నాయని ఎద్దేవా చేశారు. తమ హయాంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా వాస్తవాలు పరిశీలించి ముందుకెళ్తున్నామని వివరించారు.

చిత్రం..మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు