ఆంధ్రప్రదేశ్‌

హైవేపై మూగ రోదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 2: పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది..తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి పశువుల మూగ రోదనతో మారుమోగుతోంది. లారీల్లో లెక్కకు మించిన పశువులను మడతపెట్టి కుక్కేసి రవాణా చేస్తున్నారు. కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారిలో తుని మొదలు రావులపాలెం దాటేవరకు ప్రతి రోజూ వేలాది పశువులు వాహనాల్లో కుక్కి తీసుకు వెళ్ళడం సర్వసాధారణంగా మారింది. ఎక్కడైనా పోలీసులు ఉన్నారని గానీ జంతుప్రేమికులు నిఘా పెట్టారన్న సమాచారం గానీ తెలుసుకుంటే రంపచోడవరం ఏజెన్సీ మీదుగా లేదా ప్రధాన రహదారిని వదిలి కత్తిపూడి మీదుగా రూటు మార్చి తరలించుకుపోతున్నారని తెలుస్తోంది. అడ్డూఅదుపూ లేకుండా తరలించుకుపోతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పోలీసు శాఖ అప్రమత్తంగా లేకుంటే మధ్య దళారులు జిల్లాలు దాటించడంలో తమ వంతు పాత్ర పోషించడానికి కొంత మంది ఇదేపనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఈ విధంగా పశువుల లోడుతో వచ్చే వాహనాలను జిల్లాను దాటించి పంపించేందుకు ఒక్కో రాత్రిలోనే వేలాది రూపాయలు గడిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా పశువుల లోడు వాహనాలను జిల్లాను దాటించేందుకు ఒక ముఠా పని చేస్తుందని తెలిసింది. ఈ ముఠా పెద్ద ఎత్తున మాఫియాగా మారినట్టు తెలిసింది. పోలీసులు పట్టుకున్నా సంబంధిత పోలీసు స్టేషన్‌కు నాయకులు, ప్రజా ప్రతినిధులతో ఫోన్లలో పైరవీలు చేయించి కేసు నమోదు కాకుండా తప్పించుకుంటున్నారు. ఒక వేళ అలా కాకుండా ఉంటే కోర్టుకెళ్లి సులువుగా వచ్చే విధంగా వీగిపోయే సెక్షన్లు పెట్టించి తొందరగా బయటకొచ్చేలా చక్రం తిప్పడం షరామామూలుగా సాగిపోతోంది. ఇటీవల పలు స్టేషన్లలో నమోదైన కేసులు ఇటువంటి పరిస్థితికి అద్దం పడుతోంది. అత్యంత పకడ్బందీగా ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నపోతులు వగైరా సమృద్ధిగా పాలిచ్చేవి, ఈతకొచ్చిన పాడి పశువులు కూడా బక్రీదుకు ముందు యధేచ్ఛగా రవాణా జరిగినట్టు తెలిసింది. పశు రవాణాపై పోలీసు శాఖ పటిష్ట చట్టాలను అమలు చేసి కఠిన సెక్షన్లు నమోదు చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
రాష్ట్రంలో పశువుల రవాణా యధేచ్ఛగా సాగిపోతోందని ఇందుకు సంబంధించి పటిష్ట చట్టాలున్నా కింది స్థాయిలో పోలీసు అధికారులు ఇష్టా ఇష్టాలమీదే కేసులు నమోదవుతున్నాయి. పశుసంపద కబేళాలకు తరలిపోతోందని జంతు ప్రేమికుల వాదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపధ్యంలో హోం శాఖ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్‌సింగ్ ఆగస్టు 29న డిజిపి సాంబశివరావుకు ప్రత్యేక లేఖ రాశారు.
పశు సంక్షేమ అధికారులు, పశువుల సంక్షేమానికి పాటుపడే సంస్థలు ఇస్తున్న ఫిర్యాదుల్లో రవాణా పేరుతో పశువులు హింసకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోందని లేఖలో పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించి లెక్కకు మించి అధికంగా రవాణా అవుతున్న వేళ వస్తోన్న ఫిర్యాదులు కూడా లెక్కచేయడం లేదని ఆరోపణలు చోటు చేసుకున్నాయని, కింది స్థాయిలో పోలీసు అధికారులు పెడచెవిన పెడుతున్నట్టు తన దృష్టికి వచ్చినట్టు ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. అక్రమ పశు రవాణా, అక్రమ కబేళా వంటి అంశాలపై ఫిర్యాదులొస్తే తక్షణం స్పందించేలా చర్యలు చేపట్టాలని లేఖలో మన్మోహన్ సింగ్ కోరారు. ఆయా జిల్లాల పోలీసు అధికార్లకు తగిన దిశానిర్ధేశం చేస్తూ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. పశు సంరక్షణ విభాగాల ప్రతినిధులైనా, సాధారణ వ్యక్తులైనా పశు రవాణాలో చట్ట వ్యతిరేకంగా హింసా ప్రవృత్తిని నిబంధనలకు వ్యతిరేకంగా రవాణాదారులు కొనసాగించినట్టు ఫిర్యాదుల్లో ఏ మాత్రం పేర్కొన్నా తప్పని సరిగా స్పందించేలా చూడాలని పేర్కొన్నారు.