ఆంధ్రప్రదేశ్‌

టిడిపికి ఊపిరి పోసిన నంద్యాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 2: నంద్యాల శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం అధికార తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసినట్లయింది. గడిచిన మూడేళ్ల కాలంలో అధికార టిడిపిపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికలు వస్తే ఆ పార్టీ ప్రజల ఎదుట దోషిగా నిలబడటం ఖాయమని వైకాపా అధినేత జగన్ అనేక దఫాలు చెప్తూ వచ్చారు. ఒక సమయంలో తాను తలుచుకుంటే టిడిపి అధికారంలో గంట కూడా కొనసాగలేదని, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా టిడిపి ఎమ్మెల్యేలు తనతో కలిసి ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. దీంతో ఆందోళనకు గురైన టిడిపి వెంటనే పావులు కదిపి అప్పటికే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్న వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. దాంతో వైకాపా నుంచి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడంతో ఆ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది. ప్రజా వ్యతిరేకత కారణంగానే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశారని వైకాపా నేతలు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో నంద్యాల శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ఆనవాయితీ ప్రకారం భూమా కుటుంబంలో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి వైకాపా సహకరించాలని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు చేసిన విన్నపాన్ని వైకాపా అధినేత జగన్ తిరస్కరించారు. నంద్యాల ప్రజలు వైకాపాకు పట్టం కట్టారని తాము పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. నంద్యాల ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమేగాక ప్రచారంలో ఎత్తులు, పైఎత్తులు వేయడంతో జాతీయ స్థాయిలో ఈ ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. నంద్యాల కోటపై టిడిపి జెండా ఎగరడంతో పార్టీకి కొత్త ఊపిరి పోసినట్లయింది. దీనికి తోడు కాకినాడ పురపాలక సంఘం ఎన్నికల్లో సైతం వైకాపాకు ఎదురుదెబ్బ తగలడంతో ఆ పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. ఇదే అదునుగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సిన కర్నూలు, విశాఖపట్టణం, తిరుపతి, ఒంగోలు నగరపాలక సంస్థలతో పాటు కడప జిల్లా రాజంపేట, శ్రీకాకుళం జిల్లా రాజం పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలను నిర్వహించేలోపు వైకాపాతో పాటు కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకుంటే ప్రధాన ప్రతిపక్షం డీలా పడటం ఖాయమని టిడిపి నేతలు భావిస్తున్నారు.
ఇద్దరు మంత్రులకు బాధ్యతలు
వైకాపా బలంగా ఉందని భావిస్తున్న రాయలసీమలో కోలుకోలేని విధంగా దెబ్బతీయడానికి మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరి చర్చల కారణంగా రాయలసీమ నుంచి త్వరలో నలుగురైదుగురు వైకాపా నేతలు టిడిపిలో చేరతారని భావిస్తున్నారు. కాగా టిడిపికి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ పెట్టిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి పార్టీని రద్దు చేసి సొంత గూటికి చేరాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ చర్చల్లో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఆదినారాయణరెడ్డి కూడా పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపిలో చేరే అంశం ఖరారు చేసుకుని ఈనెల 5వ తేదీ అధికారిక ప్రకటన చేస్తారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇదే జరిగితే టిడిపిలో మరింత ఉత్సాహం పెరిగి రానున్న అన్ని ఎన్నికల్లో గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.