ఆంధ్రప్రదేశ్‌

మదనపల్లెలో ఏటిఎం ధ్వంసం.. రూ.25 లక్షలు లూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, సెప్టెంబఠ్ 2: మదనపల్లె వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఓ ఎటిఎంను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి రూ.25లక్షలు చోరీ చేశారు. చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణం బెంగళూరురోడ్డు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కూటవేటు దూరంగా ఉన్న నక్కలదినె్న ఎంట్రన్స్ ఈద్గా ఎదురుగా జాతీయరహదారి పక్కనే ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటిఎంను ఏర్పాటుచేశారు. శనివారం ఒక ఖాతాదారు ఎటిఎంకు వెళ్లగా అక్కడ పరిస్థితి చూసి అవాక్కై పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న డిఎస్‌పి చౌడేశ్వరి గ్యాస్‌కట్టర్‌తో ఎటిఎంను ధ్వంసం చేసిన ఎటిఎం యంత్రాన్ని పరిశీలించారు. సమీపంలోని ఇళ్ళకు, దుకాణాలకు ఏర్పాటుచేసుకున్న సిసి కెమెరాలను పరిశీలించారు. ఎస్‌బిఐ చీఫ్ మేనేజరు మూర్తిని పిలిపించి ఎటిఎంలో ఎంతమేరకు డబ్బులు ఉన్నాయో ఆరా తీశారు. సుమారు రూ.25లక్షలకు పైగా ఉంటుందని ఛీప్ మేనేజరు మూర్తి డిఎస్‌పికి వెల్లడించారు. సిఐ నిరంజన్‌కుమార్ సమీపంలోని దుకాణాలను, పరిసర ప్రాంతాల వారిని విచారించారు. గ్యాస్‌కట్టర్‌తో ఏకంగా ఎటిఎంను ధ్వంసం చేయడం, అందులో పాతికలక్షలకు పైగా నగదు చోరి చేయడం ఓ గ్యాంగ్ కుట్రకు పాల్పడివుంటుందని డిఎస్‌పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.