ఆంధ్రప్రదేశ్‌

2 వేల దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 2: రాష్ట్రంలోని 2వేల దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యాల కల్పనకు దేవాదాయ శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. శనివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో తనను కలిసిన విలేఖరులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ధూప,దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను గుర్తించామని తెలిపారు. వీటి అభివృద్ధికి అవసరమైన చర్యలను తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యదర్శనంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. విఐపిల తరహాలో దివ్యదర్శనానికి వస్తున్న వారికి ప్రత్యేక బస్సులు, దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న కాలంలో దివ్యదర్శనానికి వచ్చే ప్రజల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే టిటిడి ట్రస్ట్‌బోర్డును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రచార కార్యదర్శి గుండాలగోపినాథ్ రెడ్డి, ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం యాదవ్, మజ్దూర్ మోర్చా రాష్ట్ర నాయకుడు డి ఎం కెమురళి, రైతు నాయకులు నారాయణ రెడ్డి, బిజెపి నాయకులు ఆటుపాకం గోపిరెడ్డి, ఫణిభూషణ్ రెడ్డి, దీపక్ యాదవ్, మునస్వామి నాయుడు, రంగస్వామి, రాజశేఖర్ పాల్గొన్నారు.