ఆంధ్రప్రదేశ్‌

బిజెపి వైపే చూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 3: వైకాపా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి గౌతంరెడ్డి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురికావటం ఆయన వర్గంలో ఆగ్రహం నింపింది. గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైకాపా తరపున పోటీచేసిన గౌతంరెడ్డిని తర్వాత కొద్దికాలానికే ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించి తూర్పులో ఓటమిపాలైన వంగవీటి రాధాకృష్ణను నియమించడంతోనే ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. రాధాకృష్ణ 2009 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం తరపున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత రాధా కొంతకాలం కాంగ్రెస్‌లో కొనసాగి ఆపై వైకాపాలోకి వెళ్లారు. కొద్దిరోజుల క్రితం మల్లాది విష్ణు వైకాపాలోకి రావడం, వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయమనే ప్రచారంతో గౌతంరెడ్డి మరింత మానసికంగా కుంగిపోయారు. దెబ్బపై దెబ్బ అన్నట్లు రెండురోజుల క్రితం సెంట్రల్ నియోజకవర్గంలోని 20 డివిజన్లలో కూడా రాధా-రంగా అనుచరులే అధ్యక్షులుగా నియమితులయ్యారు. అప్పటివరకు ఆయా పదవుల్లో కొనసాగుతున్న గౌతంరెడ్డి అనుచరులందరినీ పూర్తిగా తప్పించడంలో రాధాకృష్ణ కృతకృత్యులయ్యారు. ఇది రాజకీయంగా మరో దెబ్బ. పార్టీలో తీవ్ర అవమాన భారంతో సతమతమవుతున్న గౌతంరెడ్డి ఇటీవల బిజెపిలో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో రహస్య మంతనాలు నడిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విద్యార్థి దశ నుంచి గౌతంరెడ్డి వామపక్ష భావజాలంతో సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘం ఎఐఎస్‌ఎఫ్‌లో వివిధ పదవులు నిర్వహిస్తూ వచ్చినప్పటికీ నాగార్జున విశ్వవిద్యాలయంలో అప్పటి ఎన్‌ఎస్‌యుఐ నేతగా కన్నా లక్ష్మీనారాయణతో సత్సంబంధాలున్నాయి. తర్వాత గౌతంరెడ్డి సిపిఐ నుంచి కాంగ్రెస్‌లో చేరాక వీరి సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. నగరంలో గౌతంరెడ్డికి గట్టి అనుచరవర్గమే ఉంది. వరుసగా నాలుగుసార్లు సిపిఐ తరపున కార్పొరేటర్‌గా గెలిచారు. గత ఎన్నికల్లో గౌతంరెడ్డి గెలుపు కోసం రాధాకృష్ణ సెంట్రల్‌లో ప్రచారం చేసినప్పటికీ తెరవెనుక ఓటమికి కృషి చేశారంటూ గౌతంరెడ్డి స్వయంగా ఇప్పుడు చెబుతున్నారు. అదే సమయంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి డివిజన్‌లోనూ రాధా-రంగా మిత్రమండలి అభ్యర్థులు పోటీచేసి తన అభ్యర్థులను ఓడించారని, ఇలాంటి స్థితిలో రేపు పొరపాటున రాధాకు సీటు వస్తే తన అనుచరులు ఎలా పనిచేయగలరని గౌతంరెడ్డి స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు.
పైగా కల్తీ మద్యం ద్వారా పలువురు అమాయకులను బలితీసుకున్న మల్లాది విష్ణును పార్టీలోకి చేర్చుకోవటం ఏమిటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే గౌతంరెడ్డి ఉద్దేశపూర్వకంగానే వంగవీటి కుటుంబం పట్ల తనకున్న అభిప్రాయాలన్నీ టివి ఇంటర్వ్యూలో చెప్పటం, ఆపై సస్పెన్షన్‌కు గురికావటం చకచకా జరిగిపోయాయి. షోకాజ్ నోటీస్‌కు సమాధానం ఇచ్చే అవకాశం లేకుండానే సస్పెండ్ చేయటం ఏమిటంటూ గౌతంరెడ్డి అనుచరులు ఆగ్రహిస్తున్నారు. ఇక బిజెపిలో చేరటానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కార్యకర్తలు ఆయన ఒత్తిడి చేస్తున్నారు.