ఆంధ్రప్రదేశ్‌

గౌతంరెడ్డి సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: వైఎస్‌ఆర్‌సిపి ట్రేడ్ యూనియన్ నాయకుడు పి గౌతంరెడ్డిని సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దివంగత వంగవీటి రంగా, ఆయన సోదరుడు రాధాలను ఉద్దేశించి ఓ టివి చానల్‌లో ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో గౌతంరెడ్డిపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి కె పార్థసారథి మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని షోకాజ్ నోటీసు జారీ చేశారన్నారు. రంగాను తామంతా అభిమానిస్తామని, అలాగే పార్టీ నాయకుడు మల్లాది విష్ణు గురించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ ఆయన వ్యక్తిగతమని, గౌతంరెడ్డి అభిప్రాయాలకు, పార్టీకి సంబంధం లేదని పార్థసారథి స్పష్టం చేశారు. పార్టీలో ఏ స్థాయి నాయకుడైనా సరే, ఏ వ్యక్తి గురించి, లేదా ఏ వర్గం గురించైనా కించపరిచే విధంగా మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తామని పార్టీ అధినేత జగన్ స్పష్టం చేసినట్లు తెలిపారు. తమ నాయకుడు జిల్లా పర్యటనలో ఉన్నారని, ఆయన వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని పార్థసారథి వివరించారు.