ఆంధ్రప్రదేశ్‌

2019లో వార్ వన్‌సైడే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 3: తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి.. 80 శాతం మందికి పైగా సంతృప్తి చెందాలి.. వచ్చే ఎన్నికల్లో జనమంతా తెలుగుదేశం పార్టీకే ఓటేసాలా చూడాలని టిడిపి చీఫ్ చంద్రబాబు పార్టీ క్యాడర్‌కు నూరిపోస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికీ ప్రభుత్వం ఏదో ఒక పథకాన్ని, లేదా ప్రయోజనాన్ని అందిస్తున్నప్పుడు వారంతా మన పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఎందుకు ఓటేస్తారు? పార్టీ క్యాడర్ అంతా జనాల మధ్య ఉంటే, జనం మన పక్కనే ఉంటారని చంద్రబాబు చెప్పుకుంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీయే విజయ పతాకాన్ని ఎగురవేయాలి. ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలి. ఇది చంద్రబాబు నాయుడి టార్గెట్. 2019లో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, 2018నే ఎన్నికల సంవత్సరంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల విషయాన్ని పక్కన పెడితే, దాదాపూ అన్ని స్థానిక సంస్థలకు 2018లోనే ఎన్నికలు జరగాలి. వెనువెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంటే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వచ్చే ఎడాది జనవరి నుంచి బిజీ అయిపోతాయి. ఈ నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ తనకున్న అవకాశాలన్నింటినీ గెలుపుకోసం ఉపయోగించుకోనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి పథకం కూడా లబ్ధిదారులకు అందాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ మూడేళ్ళు ఎమ్మెల్యేలు ఏవిధంగా పనిచేశారో పక్కన పెట్టి, ఈ రెండేళ్ళు మాత్రం కేవలం జనం కోసం పనిచేయాలని చంద్రబాబు పునరుద్ఘాటించనున్నారు.
నేడు నంద్యాల, కాకినాడ ఎన్నికలపై సమీక్ష
ఇటీవల నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి, కాకినాడ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పనిచేసిన పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు సోమవారం విజయవాడలో సమావేశంకానున్నారు. పార్టీ విజయానికి వీరు ఎలా పనిచేశారో తెలియచెప్పడానికి ప్రతి ఎమ్మెల్యే కూడా తమ తమ ల్యాప్‌టాప్‌లతో రాజధానికి రావల్సిందిగా ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర పార్టీ సమావేశంలో ఈ రెండు విజయాల గురించి పార్టీ క్యాడర్‌కు, మిగిలిన ఎమ్మెల్యేలకు వివరించనున్నారు.
11 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం!
కాకినాడ, నంద్యాల విజయాలతో జోష్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీ ఈనెల 11 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం అన్న కార్యక్రమాన్ని చేపట్టనుంది. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇల్లు, రేషన్ కార్డు, పింఛన్, నేషనల్ ఫ్యామిలి బెనిఫిట్ స్కీం అందుతున్నాయా? లేదా? చూడాలి. ఒకవేళ అందకపోతే అవి అందేలా చూడాలి. ఈ సంవత్సరం ఆఖరుకు గృహ నిర్మాణాలు పూర్తి కావాలి. అలాగే, తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న వారికి క్యాడర్ మరింత చేరువై పనిచేయాలి. వారి కష్టాలను తెలుసుకుని, వీలైనంత వరకూ తీర్చే ప్రయత్నం చేయాలి. తెలుగుదేశం మంజూరు చేసిన కాలనీలకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి. తద్వారా గ్రామస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతం చేయాలన్నది ఇంటింటికీ తెలుగుదేశం లక్ష్యం. ఇలా చేయడం వలన ప్రజల్లో టిడిపి పట్ల విశ్వాసం పెరుగుతుంది. ప్రతిపక్షాన్ని పక్కన పెడతారన్నది అధికార పార్టీ వ్యూహం.