ఆంధ్రప్రదేశ్‌

కొద్ది గంటల్లోనే రిటైర్‌మెంట్..అంతలోనే ఎసిబి ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారి నుంచి అతి చిన్న ఉద్యోగి వరకు తమ పదవీ కాలంలో కోట్లాది రూపాయలను అక్రమంగా ఏ విధంగా కూడబెడుతున్నారో కృష్ణాలో ఇటీవలికాలంలో పరంపరగా కొనసాగుతున్న ఎసిబి అధికారుల దాడుల్లో వెలుగుచూస్తున్న వైనాలు నిరూపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం పదవీ విరమణ చేయబోతున్న ఒక గ్రామ రెవెన్యూ అధికారి విలువైన అక్రమ ఆస్తులతో గురువారం పట్టుబడ్డారు. ఎసిబి డిఎస్‌పి గోపాలకృష్ణ కథనం ప్రకారం ఇబ్రహీంపట్నంలో గతంలో దాదాపు 20 ఏళ్లపాటు గ్రామ కరణంగా పనిచేసిన బెహరా సీతారామయ్య గ్రామ రెవెన్యూ అధికారిగా పదోన్నతి పొందారు. తొలుత అవనిగడ్డకు నియమితులు కాగా కొంతకాలం సెలవుపై ఉండి విస్సన్నపేట మండలం వేములరెడ్డిపల్లికి బదిలీ అయ్యారు. అక్కడ కూడా కొద్ది రోజులపాటు మాత్రమే విధులు నిర్వర్తించి ఇటీవల సెలవులో కొనసాగుతున్నారు. కొంతకాలం కోర్టు వివాదాల్లో చిక్కుకుని విధులు నిర్వర్తించేందుకు తనకు అనుకూలంగానే ఉత్తర్వులు తెచ్చుకోగల్గారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా సీతారామయ్య ఇటీవల కోటి రూపాయలను వడ్డీకి ఇచ్చినట్లుగా అందిన సమాచారంపై ఎసిబిడిఎస్‌పి గోపాలకృష్ణ, సిఐలు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు వారి సిబ్బంది గురువారం ఇబ్రహీంపట్నంలోని ఆయన స్వగృహంపై మెరుపుదాడులు నిర్వహించారు. కోటి రూపాయలు అప్పుగా ఇచ్చినట్లు పత్రాలను కూడా స్వాధీనపర్చుకున్నారు. అసైన్డ్ భూములు, జమిందారీ భూములు, ఇనాం భూములను తనకున్న పలుకుబడి, అపార అనుభవంతో అన్యాక్రాంతం చేసుకున్నట్లు గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్న ఆయన కుమారుడి నుంచి ఒక కోటి 70 లక్షలు విలువకల్గిన పత్రాలను కూడా స్వాధీనపర్చుకున్నారు. ఇంకా వివిధ బ్యాంకు లాకర్లు, చెక్ పుస్తకాలు, బ్యాంక్ ఖాతాల గురించి పరిశోధిస్తున్నారు.
పాలకొల్లు ఎంవిఐ ఇళ్లపై ఎసిబి దాడులు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవిఐ)గా పనిచేస్తున్న బానుతి స్వర్ణ శ్రీనివాస్ నాయక్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదుపై హైదరాబాద్‌లోని ఎసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. డిఎస్పీలు కెవి బి ఎన్‌వి ప్రసాద్, ఎస్‌వివి ప్రసాదరావు ఆధ్వర్యంలో పాలకొల్లు, ఏలూరు, తణుకులో ఈ తనిఖీలు జరిగాయి. కాకినాడ, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో ఈదాడులు కొనసాగాయి. రాత్రి పొద్దుపోయే సమయానికి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇంత వరకు పాలకొల్లులో రూ.24 వేల నగదు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు లభ్యమైనట్లు తెలుస్తోంది. అలాగే ఏలూరులో ఆయనకు సన్నిహితంగా వుంటారని భావిస్తున్న కేశిన సత్యనారాయణ అనే ఆర్‌టిఎ మాజీ ఏజెంట్ ఇంట్లోనూ తనిఖీలు జరిగాయి. పూర్తి వివరాలు శుక్రవారంనాటికి వెలుగు చూస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.

చిత్రం సీతారామయ్య ఇంట్లో దాడులు నిర్వహిస్తున్న ఎసిబి అధికారులు