ఆంధ్రప్రదేశ్‌

నిమజ్జనంలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, సెప్టెంబర్ 3: గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొని, తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆదివారం ఇంజనీరింగ్ విద్యార్థి ఒకరు కాలువలో గల్లంతయ్యారు. రావులపాలెంలోని కెఎస్‌ఆర్ కాంప్లెక్స్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాన్ని ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో స్థానిక అమలాపురం రోడ్డులోని ముక్తేశ్వరం ప్రధాన పంట కాలువ రేవులో నిమజ్జనం చేశారు. నిమజ్జనంలో పాల్గొన్న లింగోలు నాగవెంకట శివ సూర్యసాయి (18) సూర్యసాయి ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో కాలువలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సాయి ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థి. సమాచారం అందుకున్న ఎస్సై సిహెచ్ విద్యాసాగర్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన గొంతల పోసియ్య (27) వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం గోదావరిలో గల్లంతయ్యాడు.