ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి భక్తులకు పటిష్ఠ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 3: ఈనెల 23నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటుచేస్తామని రాయలసీమ డి ఐజి ప్రభాకర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన తిరుమలలో విలేఖరులతో మాట్లాడుతూ గతేడాది బ్రహ్మోత్సవాల్లో గుర్తించిన పొరపాట్లను పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం నాలుగు మాడ వీధుల్లో సిసి కెమెరాల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. చిన్న పిల్లలు తప్పిపోయే పరిస్థితి లేకుండా కంట్రోల్ రూం ద్వారా తమ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంటారన్నారు. ఇందులో భాగంగా ద్విచక్రవాహనాలను కొండపైకి అనుమతించడం లేదన్నారు. బ్రహ్మోత్సవాల్లో సేవాదళ్ పోలీస్ సిబ్బంది సేవలు వినియోగించుకుంటామన్నారు.