ఆంధ్రప్రదేశ్‌

ఇక ఆన్‌లైన్‌లోనే సరకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 3: ఆన్‌లైన్‌లో వివిధ రకాల సరకులను రేషన్ కార్డుదారులకు సరఫరా చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. విలేజ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాక ఆన్‌లైన్‌లో కూడా సరకులను ఆర్డర్ ఇచ్చి పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో బియ్యం మినహా ఇతర సరకులు ఇవ్వడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రేషన్ దుకాణాలను గ్రామీణ మాల్స్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలి దశలో 5వేల గ్రామీణ మాల్స్ ఏర్పాటు చేసేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. మాల్స్ నిర్వహణకు సంబంధించి టెండర్లు పిలవగా, మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. దీనికి సంబంధించిన ఫైనాన్స్ బిడ్లను ఈ నెల 8న తెరవనున్నారు. గ్రామీణ మాల్స్‌లో 200 రకాల సరకులను అందుబాటులో ఉంచనున్నారు. మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువకు మాల్స్‌లో సరకులు విక్రయిస్తారు. ఈ మాల్స్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా రేషన్ కార్డుదారులు తమకు కావాల్సిన సరకులను ఆర్డర్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డరు చేసిన సరకులను నేరుగా ఇళ్లకే సరఫరా చేస్తారు. ఈ విధానంతో గ్రామాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ రూపురేఖలు మారనున్నాయి.