ఆంధ్రప్రదేశ్‌

చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భట్టిప్రోలు, సెప్టెంబర్ 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతల అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నాయని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో ఆదివారం కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత ప్లాట్ లెవెల్ క్లస్టర్ల ద్వారా వృత్తిలో నైపుణ్యతా శిక్షణ పొందిన 120మందికి యోగ్యతా పత్రాల మంజూరు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ నూతన విధానాల ద్వారా చేనేత కార్మికులకు శిక్షణ ఇవ్వటం ద్వారా ఈ రంగంలోనూ ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ పొందిన వారిని ఆదర్శంగా తీసుకొని మరికొందరు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం చేనేత కార్మికుల రుణాలు రూ. 100కోట్లకు పైగా మాఫీ చేయటమేగాక, వడ్డీలు కూడా రద్దుచేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమైందన్నారు.
చేనేతల కష్టాలు తెలిసిన పార్టీ టిడిపి అని, రానున్న రోజుల్లో మరో 25వేల మంది కార్మికులకు పెన్షన్లు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జిఎస్టీని చేనేత వస్త్రాలపై రద్దుచేయాలనే డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో జరగనున్న ఆర్థిక మంత్రుల సమావేశంలోనూ దీనిపై చర్చించి మినహాయింపు పొందేందుకు ముఖ్యమంత్రి ద్వారా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న కార్మికులకు యోగ్యతా పత్రాలను ఆనందబాబు అందజేశారు. కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, ఎంపిపి వాకా సుధ, జెడ్పీటిసి బండారు కుమారి, క్లష్టర్ చైర్మన్ రాంబాబు, జౌళి శాఖ డిడి కొమ్ము రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..శిక్షణ పొందిన చేనేత కార్మికులకు యోగ్యతా పత్రాలు అందజేస్తున్న మంత్రి ఆనందబాబు