ఆంధ్రప్రదేశ్‌

అమెరికాలో 9నుంచి తెలుగు తరగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 3: అమెరికాలో తెలుగు చిన్నారులకు గత నాలుగేళ్లుగా తెలుగు భాష నేర్పిస్తున్న ఎన్‌ఆర్‌ఐ సంస్థలు తిరిగి ఈ నెల 9 నుంచి తరగతులు ప్రారంభించబోతున్నాయి. అమెరికాలో ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కృష్ణా జిల్లావాసి కోమటి జయరామ్ చైర్మన్‌గా ఎంఎస్‌ఏ, ఇతర సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పాఠశాల 501 సి(3) సర్ట్ఫికెట్ కూడా పొందింది. అమెరికాలో దాదాపు ఈ సంస్థ 25 కేంద్రాలను నిర్వహిస్తోంది. ప్రధానంగా బేఏరియా, లాస్‌ఏంజిల్స్, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, మేరీలాండ్, వర్జీనియా, డెట్రాయిట్‌లో తెలుగు తరగతులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా అమెరికాలో పనిచేస్తున్న కోమటి జయరాం అక్కడి తెలుగు చిన్నారుల కోసం ఈ పాఠశాలలను ప్రారంభించారు. తాజాగా రాష్ట్ర విద్యాశాఖ సూచించిన సిలబస్ ప్రకారం ప్రస్తుత విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించబోతున్నారు. ఈ పాఠశాలల ద్వారా తెలుగు వెలుగు కోర్సును చిన్నారులకు నేర్పిస్తున్నారు. పైగా కొత్త పద్ధతిలో సులభంగా తెలుగు నేర్చుకునేలా ఉన్న ఈ కోర్సును ప్రతి ఎన్నారై తెలుగు కుటుంబంలోని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోమటి జయరాం అన్నారు. పాఠశాల సిఇవో చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ సిలబస్ ప్రకారం తెలుగులో పాఠ్య పుస్తకాలు ముద్రించాలని, ముఖ్యంగా తెలుగుభాషను క్రమపద్ధతిలో నేర్పించడంతో పాటు చిన్నారులు శాస్ర్తియంగా అభ్యసించేలా తమ బోధన ఉంటుందన్నారు. ‘లెర్నింగ్- స్పీకింగ్- రీడింగ్- రైటింగ్’ పద్ధతిలో తెలుగు భాషను తెలుసుకోటం, ఆపై మాట్లాడటం, చదవడం, రాయడం వంటి పద్ధతుల్లో తమ బోధన సాగుతుందన్నారు.
ఇలాంటి ప్రక్రియ ద్వారా తెలుగు అక్షరాలు నేర్పించే పద్ధతి ఎన్నారై ప్రపంచంలో ఇదే తొలిసారని అన్నారు. ఈ కొత్త పద్ధతి ద్వారా తొలుత వర్ణమాలతో కొన్ని సరళ పదాలు నేర్పి వాటిని పలకటం, చదవటం చేయిస్తారు. అలాగే పాఠ్య పుస్తకాలు చదివించటం ద్వారా ముందుగా తెలుగులో మాట్లాడటం అలవాటు చేస్తారు. ఇది శాస్ర్తియంగా, ఆధునికంగా తయారైన బోధనా పద్ధతి. ఫోర్సీ ఐఎన్‌సి కంపెనీ ఈ పాఠశాలలకు టెక్నాలజీ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఆన్‌లైన్ ద్వారానూ కోర్సులు నిర్వహిస్తోంది.