ఆంధ్రప్రదేశ్‌

మావో ప్రభావిత ప్రాంతాల్లో సోలార్ విద్యుద్దీపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 3: రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో విద్యుత్ లైన్లు లేని గ్రామాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా మావో ప్రభావిత ప్రాంతాల్లో కూడా సోలార్ విద్యుద్దీపాలు ఏర్పాటు చేసేందుకు సర్వే చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలోని మావో ప్రభావిత జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలను గుర్తించడంలో నెడ్‌క్యాప్ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఆయా జిల్లాల్లోని ఐటిడిఎల నుంచి వివరాలను సేకరించి ఆయా గిరిజన ప్రాంతాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. ఇదిలా ఉండగా విజయనగరం జిల్లాలో ఐటిడిఎ పరిధిలో ఎనిమిది మండలాలు ఉన్నాయి. వీటన్నింటిలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు సోలార్ విద్యుత్ దీపాలు అందించనున్నట్టు నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అలాగే రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగంలో విజయనగరం జిల్లా ముందంజలో ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్‌ను అందించడం ద్వారా పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నాయని వివరించారు. ఇదిలా ఉండగా సోలార్ విద్యుత్ నెలకోల్పేందుకు పెట్టుబడి లేనివారికి రెస్కో సంస్థ పెట్టుబడి పెట్టి సోలార్ విద్యుత్‌ను సరఫరా చేయడంతోపాటు ట్రాన్స్‌కో కంటే తక్కువ ధరకు విద్యుత్‌ను అందించనుందని తెలిపారు. ధర్మల్ విద్యుత్‌ను ఆదా చేయడంతోపాటు పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు సోలార్ విద్యుత్ ఒక్కటే మార్గం. అందువల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందిస్తోంది. మరోపక్క సోలార్ పంపుసెట్ల వినియోగానికి కూడా రైతులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.

చిత్రం..విజయనగరం జెడ్పీలో సోలార్ ప్యానల్