ఆంధ్రప్రదేశ్‌

మోదీజీ.. దేశంలో ఎన్నికల సంస్కరణల కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 4: ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికల నిర్వహణ, నిబంధనలు చాలా బలీయమైనప్పటికీ ఆ విధానంలో ఎన్నికలు జరగకపోవడం, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు అవుతోందని, అటువంటి ఎన్నికలను సంస్కరించాలంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేసారు. సోమవారం రాత్రి ఇక్కడ జరిగిన వైకాపా సభలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత తగ్గిపోతుందని, నక్సలైట్లు, తీవ్రవాదులకు డబ్బు కొరత ఏర్పడుతుందని చెప్పిన మాటలు గుర్తు చేసారు. ఇటీవల తమిళనాడు, నంద్యాల ఎన్నికల్లో ధనప్రభావం పనిచేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం, ఆదాయపుపన్నుశాఖ, ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేకపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట రుజువు కాలేదనడానికి ఈ రెండు ఎన్నికలే నిదర్శనమని ధర్మాన పేర్కొన్నారు. కొద్ది మంది కోటీశ్వరుల చేతుల్లో ఎన్నికలు ఉంటే, సామాన్య జనం చట్టసభల్లోకి వెళ్లే పరిస్థితులు ప్రజాస్వామ్యంలో కన్పించకుండా పోతాయన్నారు. అదే జరిగితే రాజ్యంగం చెప్పింది పూర్తి ఆచరణకు నోచుకోపోవడమేనంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందన్నారు. ప్రధానమంత్రి నీతినిజాయితీగా పాలిస్తున్న భారతదేశంలో ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుడితేనే ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛాపూరితంగా ఓటు హక్కు వినియోగించుకునే భాగ్యం భారతదేశానికి కలుగుతుందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ధర్మాన కోరారు. ఎన్నికలపై డబ్బు ప్రభావితం చేస్తోందని, డబ్బుగల కొద్దిమందే చట్టసభలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణలు తీసుకువస్తే నల్లధనం ప్రభావం నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం కలుగుతుందన్నారు. ఏపిలో ఇటీవల జరిగిన ఎన్నికల తీరుతెన్నులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచి కేంద్ర ఎన్నికల కమిషన్ విధివిధానాలకు అతీతమైన చట్టాలు సమీకరించాల్సి ఉందన్నారు. ఇటువంటి ఎన్నికలవల్ల ఓటరుకు విశ్వాసం సన్నగిల్లుతుందన్న అన్నారు.