ఆంధ్రప్రదేశ్‌

అంత నమ్మకం ఉంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, సెప్టెంబర్ 4: కాకినాడ, నంద్యాల ఎన్నికల్లో విజయం సాధించామని, కాపులు తమ వెంటే ఉన్నారని సంబరాలు చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2019 వరకు ఆగకుండా అసెంబ్లీ రద్దుచేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సూచించారు. రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలు తమ వెంటే ఉన్నాయనే నమ్మకంతో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ సత్తా మరోసారి చాటేలా అసెంబ్లీని రద్దుచేస్తే తాను బిసి రిజర్వేషను డిమాండ్‌ను, ఉద్యమాన్ని వదిలేస్తానని ముద్రగడ అన్నారు. కిర్లంపూడిలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. 2004-2014 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లోను టిడిపికి డిపాజిట్లు కూడా దక్కని విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పటి ఎన్నికల్లో టిడిపి డిపాజిట్లు కూడ కోల్పోయిందని, ఆ పరిస్థితుల్లో పార్టీని మూసేసి చంద్రబాబు ఇంటికెళ్లిపోయారా అని ముద్రగడ ప్రశ్నించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తే కాపు ఉద్యమం వదిలేయాలా అని ఆయన ప్రశ్నించారు. కాకినాడలో తెలుగుదేశం గెలవడంవల్ల ముద్రగడ ప్రభావం లేదని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ప్రకటిస్తుండటంతో ముద్రగడ స్పందించారు. కాపు మంత్రులు పదవులకు రాజీనామాచేసి, కాపులను బిసిల్లో చేర్చాలనే డిమాండ్ అమలుకు ఉద్యమ బాధ్యతలు స్వీకరించాలని, వారి ఆధ్వర్యంలో జరిగే ఉద్యమానికైనా ప్రభుత్వం అంగీకరించి, కాపులకు బిసి రిజర్వేషన్ ఇస్తే తాను సంతోషిస్తానన్నారు. కాపులను బిసిల్లో చేరుస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ఆ విషయంలో నాన్పుడు విధానం మాని వెంటనే హామీ నెరవేర్చాలని సినీనటుడు పవన్ కల్యాణ్ పేర్కొనడంపై ముద్రగడ హర్షం వ్యక్తం చేశారు. కాపులను అవహేళన చేసి మాట్లాడడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. సమావేశంలో కాపు జెఎసి నాయకులు ఆకుల రామకృష్ణ, గౌతు స్వామి, ఆర్‌వి సుబ్బారావు పాల్గొన్నారు.