ఆంధ్రప్రదేశ్‌

ఇంద్రకీలాద్రిపై టిక్కెట్ల ధరలు తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) సెప్టెంబర్ 4: న్యూఢిల్లీలోని ఏపి భవన్‌లో త్వరలో శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు దుర్గగుడి కమిటీ చైర్మన్ గౌరంగబాబు, ఇవో సూర్యకుమారి తెలిపారు. సోమవారం నగరంలోని మాడపాటి వారి సత్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసే విషయమై ఇప్పటికే సంబంధింత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలను సుమారు 15కోట్ల బడ్జెట్‌తో నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. గొల్లపూడిలో దాతల సహాయంతో అతి పెద్ద కాటేజీని నిర్మించేందుకు సైతం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. అంతరాలయం దర్శనం టిక్కెట్ రూ. 300 నుంచి 150కి, ఇదేవిధంగా రూ. 100 టిక్కెట్ ధరను 50 రూపాయలకు తగ్గించేందుకు ట్రస్ట్ బోర్డు తీర్మానం చేసి ఆమోదం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినట్లు వారు వివరించారు. త్వరలో మరో రెండు ప్రత్యేక పూజలను సైతం ప్రవేశ పెట్టే ఆలోచన ఉందన్నారు. ఈ దసరా మహోత్సవాలకు భక్తులను ఘాట్‌రోడ్ మార్గం గుండానే కొండపైకి అనుమతించి మెట్ల మార్గం గుండా కిందకు దిగే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వారు వివరించారు.