ఆంధ్రప్రదేశ్‌

శాసన మండలిని సజావుగా నడిపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, సెప్టెంబర్ 4: రాష్ట్ర శాసన మండలిని సజావుగా నడిపిస్తానని, ప్రజా సమస్యలపై చర్చ జరిగే విధంగా చూస్తానని శాసన మండలి చైర్మన్‌గా ప్రకటించిన ఎన్‌ఎండి ఫరూఖ్ పేర్కొన్నారు. సోమవారం గుంటూరుజిల్లా మంగళగిరిలో టిడిపి నిర్వహించిన వర్క్‌షాప్‌లో శాసన మండలి చైర్మన్‌గా ఫరూఖ్ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖర్లతో ఫరూఖ్ మాట్లాడుతూ తనకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉందన్నారు. శాసనమండలిలో పెద్దలు ఎక్కువగా ఉంటారని, సభను హుందాగా, సజావుగా నడిపిస్తానన్నారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చ జరిగే విధంగా చూస్తానన్నారు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ముస్లిం మైనార్టీలకే శాసన మండలి చైర్మన్ పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన కొద్దిరోజుల్లోనే చైర్మన్ పదవికి తన పేరును ప్రతిపాదించడం పట్ల ఫరూఖ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు తెలుగుదేశం పార్టీ పక్షానే ఉన్నారనేందుకు నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం నిదర్శనమన్నారు. ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్నందున టిడిపికి మైనార్టీలు దూరంగా ఉన్నారనే ప్రచారం కూడా అవాస్తవమనే విషయం నంద్యాల గెలుపుతో రుజువైందని ఫరూఖ్ అన్నారు. ముస్లింల సంక్షేమానికి తొలినుంచి పాటుపడుతోంది తెలుగుదేశం పార్టీయేనని, మైనార్టీలకు వైసీపీ చేసిందేమీ లేదని, చేయడానికి కూడా ఆ పార్టీకి ఎప్పుడూ అధికారం లేదని ఫరూఖ్ అన్నారు. 2019 ఎన్నికల్లోనూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని, నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలే అప్పుడూ వస్తాయని అన్నారు.