ఆంధ్రప్రదేశ్‌

నీళ్లున్నచోటే శక్తి చెట్టున్నచోటే ఉల్లాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 4: ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ శక్తి ఉంటుంది.. ఎక్కడ చెట్టు ఉంటుందో అక్కడ మానసిక ఉల్లాసం ఉంటుంది.. నీటి భద్రతతోనే జీవనభద్రత, సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధ్యం.. అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం తన నివాసం నుంచి ‘నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘జలసిరికి హారతి’ కార్యక్రమం సెప్టెంబర్ 6,7,8 తేదీల్లో అన్ని మండలాల్లో వేడుకగా జరపాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జలవనరులకు ప్రత్యేక పూజలు నిర్వహించాలన్నారు. నది, చెరువు, వాగు-వంక, చెక్‌డ్యామ్, పంట కుంటల్లో చేరిన నీటికి హారతులు ఇచ్చి స్వాగతం పలకాలన్నారు. ప్రకృతితో ప్రతి ఒక్కరూ మమేకం కావాలని ఉద్బోధించారు. జలసిరికి హారతి కార్యక్రమంలో ఆనందలహరిని జోడించాలని, ఆనందంగా అన్నిచోట్ల జలవనరులకు ఆహ్వానం పలకాలని చెప్పారు. రాష్ట్రంలో భూగర్భ జలం, ఉపరితల జలం సమృద్ధిగా పెరగాలని, అప్పుడే మన సమస్యలన్నీ మటుమాయం అవుతాయని అన్నారు. తిరుపతిలో పచ్చదనాన్ని రాష్టప్రతి కోవింద్ ప్రశంసించిన విషయం ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ప్రతి పుణ్యక్షేత్రం, పర్యాటక క్షేత్రం వద్ద పచ్చదనం పెంచాలని సూచించారు. ఏరువాక, వనమహోత్సవం, జలసిరికి హారతి వేడుకలను ప్రతి ఏటా రాష్ట్ర పండుగలుగా ఘనంగా నిర్వహించాలన్నారు. వీటిలో అన్ని వర్గాల ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని ఆదేశించారు. కాగా రూ.800 కోట్ల మెటీరియల్ కాంపొనెంట్ నిధులు వెంటనే ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అప్పుడే కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాష్ట్రానికి అందుతాయన్నారు. సిమెంట్ రోడ్లు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. నరేగా కింద ఇప్పటివరకు 16.8 కోట్ల పని దినాలకు గాను 16కోట్ల పనిదినాలు పూర్తిచేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పంటకుంటలు లక్షా 5వేలు పూర్తయ్యాయని, మరో లక్షా 30వేలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. సిసి రోడ్ల నిర్మాణం 1,900 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ మందకొడిగా జరగడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి ప్రకటించారు. 162 పనులు పూర్తయ్యాయంటూ, ప్రారంభించిన 723 పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ భవనాలు 1,187 పూర్తిచేశారని, నిర్మాణంలో ఉన్న 3,740 వెంటనే పూర్తయ్యేలా శ్రద్ధ చూపాలన్నారు. అక్టోబర్ 2న లక్ష కుటుంబాల గృహ ప్రవేశం ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వరల్డ్ హేబిటేషన్ డే సందర్భంగా అక్టోబర్ 2న సామూహిక గృహ ప్రవేశాలు పెద్దఎత్తున నిర్వహించాలన్నారు. 2017-18కి సంబంధించి ఇళ్ల మంజూరు 72 శాతం మాత్రమే పూర్తయిందని, 100 శాతం వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. 2018-19 ఇళ్లకు సంబంధించి శాంక్షన్లు కేవలం 42 శాతం మాత్రమే జరిగిందంటూ, వాటిని కూడా నూరుశాతం మంజూరు చేయాలన్నారు. అన్ని శాఖల సిబ్బందికి గ్రేడింగ్ ఇవ్వాలి, పనితీరు, ఫిర్యాదుల పరిష్కారం బట్టి వారి సామర్థ్యం అంచనా వేసి ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాల వారీగా వివిధ శాఖల్లో పురోగతిపై కూడా గ్రేడింగ్ ఇచ్చి తక్కువ గ్రేడ్ సాధించిన జిల్లాల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మన కష్టం కొంచెం పెంచితే శాశ్వతంగా సమస్యలు అధిగమించవచ్చు. కష్టపడి పనిచేయండి, అనుకున్న ఫలితాలు సాధించండి’ అని అధికార యంత్రాంగానికి సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్స్, వాతావరణ శాఖ, వ్యవసాయశాఖ, జలవనరులశాఖలు సమన్వయంగా పనిచేయాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌ను మరో 5రెట్లు పెంచాలని, 20 లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు పెరిగినప్పుడే దిగుబడుల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పండ్ల తోటల సాగును మరో రెండున్నర రెట్లు పెంచాలని, ప్రస్తుతం ఉన్న 40 లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు ఉద్యాన సేద్య విస్తీర్ణం పెరగాల్సి ఉందన్నారు. నమత్స్య రంగంలో ఉన్న కాలుష్య సమస్య ఉద్యాన రంగంలో ఉండదంటూ, ఉద్యాన రంగంలో వృద్ధిరేటు 18 శాతం నుంచి 30 శాతానికి పెరిగేలా మరింత శ్రద్ధ వహించాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, వ్యవసాయ, జలవనరులు, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, రియల్ టైమ్ గవర్నెన్స్, ఆర్థికశాఖల ఉన్నతాధికారులు రాజశేఖర్, శశిభూషణ్, చిరంజీవి చౌదరి, రామాంజనేయులు, కాంతిలాల్ దండే, అహ్మద్‌బాబు, రవిచంద్ర, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.