ఆంధ్రప్రదేశ్‌

డిఇఓ నియామకాలపై ఉన్నతస్థాయి న్యాయవిచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: రాష్ట్రంలో జిల్లా విద్యాశాఖ అధికారుల (డిఇఓ) నియామకాలకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమాల కథనాలు, ఆరోపణలపై ఉన్నతస్థాయి న్యాయవిచారణకు సోమవారం ఆదేశించింది. ఈ న్యాయ విచారణ కమిటీకి ఏఎఫ్‌ఆర్‌సి చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి తోటకూర రంగారావు నేతృత్వం వహించనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. డిఇఓ నియామకాల్లో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటిని భర్తీచేసే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. విద్యారంగ ఉన్నతే ధ్యేయంగా, పారదర్శకంగా పనిచేసే నేపథ్యంలో ఉన్నతస్థాయి విచారణ చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. అక్రమాల ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, కమిటీ నెలలోపు నివేదిక సమర్పిస్తుందని అన్నారు. ఆరోపణల్లో నిజానిజాలను కమిటీ వెలికితీస్తుందని, నిందితులని తేలితే ఎలాంటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని మంత్రి గంటా స్పష్టం చేశారు.