ఆంధ్రప్రదేశ్‌

పేదలకు ఆహార భద్రత ప్రభుత్వం విధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమని పౌరసరఫరాలు, ధరల నియంత్రణ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం నగరంలోని ఒక హోటల్‌లో జరిగిన ఆహార భద్రత చట్టం వర్క్‌షాపులో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పిడిఎస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు రేషన్ షాపుల్లో సరుకులు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలకు వినియోగ వస్తువులు అందుబాటులోకి తీసుకురావటానికి విలేజ్ మాల్స్‌ను తీసుకువస్తున్నామన్నారు. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 630 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వంపై ప్రజలలో ఇప్పటికే 80 శాతంకు పైగా సంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోందన్నారు. కాగా నేడు ఆహార భద్రత చట్టం కింద కార్డుదారులకు రేషన్ అందించడం పేదలకు ఒక హక్కుగా లభించిందని మహిళా సాధికారత, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. రాష్ట్ర సివిల్ సప్లయ్‌స్‌శాఖ తరఫున అంగన్‌వాడీ సెంటర్లకు ఇచ్చే గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ ఇచ్చే విధంగా గ్యాస్ డీలర్లకు ఆదేశాలు ఇవ్వాలని అధికారులను కోరారు. ప్రస్తుతం అంగన్‌వాడీ సెంటర్లకు ఆధార్ నెంబర్ లేకపోవడం చేత ఐటి నెంబర్ ఇవ్వలేదని, దాంతో గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ రావడం లేదన్నారు. ఆధార్ నెంబర్ లేకపోయినా ఐడి నెంబర్ ఇచ్చే విధంగా స్థానిక గ్యాస్ డీలర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఎపి స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ జెఆర్ పుష్పరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవానికి నేడు ఆహారపు భద్రత ఒక హక్కుగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వల్ల ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కూడా దీనికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. వ్యవసాయ, పౌరసరఫరాల ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, స్ర్తిశిశు సంక్షేమశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, 13 జిల్లాల జాయింట్ కలెక్టర్-2లు, డిఎస్‌వోలు, పిడిలు పాల్గొన్నారు.