ఆంధ్రప్రదేశ్‌

గురువులకు పాదాభివందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: బతుకుదారి చూపిన గురువులను ఘనంగా సత్కరించడంలో ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని, చదువు నేర్పిన గురువులకు పాదాభివందనం చేసి గౌరవించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయుడని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని గురుపూజోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరిస్తున్నామన్నారు. విజయవాడలోని ఏ ప్లస్ కనె్వన్షన్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించనున్న రాష్టస్థ్రాయి గురుపూజోత్సవ వేడుకల ఏర్పాట్లను సోమవారం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి బి.ఉదయలక్ష్మితో కలిసి మంత్రి గంటా పరిశీలించారు. బతుకుదారి చూపిన వారే గురువులని, సమాజంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి మార్గదర్శకులుగా గురువులు ఆదర్శనీయులన్నారు. గతంలో నామమాత్రంగా గురుపూజోత్సవ వేడుకలను చిన్నస్థాయిలో నిర్వహించేవారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి ఆ ఏడాది గుంటూరులో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో తనకు పాఠాలు చెప్పిన గురువులను సభావేదికపై సన్మానించడంతోపాటు పాదాభివందనం చేశారని గుర్తు చేశారు. ఆనాటి ఆ సంఘటన ద్వారా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, దేశానికి రాష్టప్రతి అయినా గురువులను సమున్నతంగా గౌరవించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యతని ముఖ్యమంత్రి చాటి చెప్పారన్నారు. గురుపూజోత్సవ దినోత్సవాన్ని కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా పెద్ద వేడుకలాగా జరపాలని ముఖ్యమంత్రి సంకల్పించారన్నారు. గతంలో గురువులను సన్మానించి కొద్దిపాటి సహాయాన్ని అందించే వారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ విధానానికి స్వస్తిపలికి రూ.20వేలు నగదు పురస్కారం, ట్యాబ్, మెమొంటో, శాలువాతో సత్కరించే విధానాన్ని ప్రారంభించారన్నారు. రాష్ట్ర గురుపూజోత్సవం సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా 127 మంది గురువులను మంగళవారం విజయవాడ నగరంలో సత్కరిస్తున్నామన్నారు.