ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణ కార్పొరేషన్‌లో మండల స్థాయి సమన్వయకర్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత మూడేళ్ళుగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం వివిధ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని సంస్థ చైర్మన్ వేమూరి ఆనందసూర్య తెలిపారు. ఈ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకువెళ్ళి మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, వీలైనంత ఎక్కువమంది అర్హులైన అభ్యర్థులకు ప్రయోజనం కలిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారని సోమవారం ఒక ప్రకటనలో ఆనంద సూర్య పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు అందించే లక్ష్యంతో మండల స్థాయి సమన్వయకర్తలను నియమించాలని భావిస్తున్నామన్నారు. సంస్థ అమలు చేస్తున్న పథకాలకు ప్రాచుర్యం కల్పించి అర్హులైన బ్రాహ్మణులకు వివరాలు తెలియజేసి, దరఖాస్తు చేయించడానికి, వారికి అవసరమైన తోడ్పాటు అందించడానికి సేవాభావం కలిగి, అంకితభావంతో పని చేయగలిగిన చురుకైన, ఉత్సాహవంతులైన బ్రాహ్మణ అభ్యర్థుల నుంచి సమన్వయకర్తలుగా పని చేయడానికి దరఖాస్తులు కోరుతున్నామన్నారు.