ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు జిల్లాను మూడోసారి వరించిన మండలి చైర్మన్ పదవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, సెప్టెంబర్ 4: రాష్ట్ర పరిధిలో చట్టాల రూపకల్పనకు పెద్దల సభగా అభివర్ణించే శాసనమండలి చైర్మన్ పదవి కర్నూలు జిల్లావాసులను మూడవ సారి వరించింది. నంద్యాల పట్టణానికి చెందిన ఎమ్మెల్సీ ఎన్‌ఎండి ఫరూక్‌ను మండలి చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు. నంద్యాల పట్టణానికే చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు నివర్తి వెంకటసుబ్బయ్య 1974లో శాసన మండలి చైర్మన్‌గా ఎంపికయ్యారు. 1978 మార్చి 28వ తేదీ ఆయన స్వర్గస్తులయ్యేంత వరకు మండలి చైర్మన్‌గా పనిచేశారు.
అలాగే ఓర్వకల్లు మండలానికి చెందిన చక్రపాణియాదవ్ 2011లో శాసన మండలి చైర్మన్‌గా పదవి చేపట్టి ఇటీవలి వరకు కొనసాగారు. చక్రపాణియాదవ్ స్థానంలో నంద్యాలకు చెందిన ఎన్‌ఎండి ఫరూక్ మండలి చైర్మన్‌గా నియమితులయ్యారు. దీంతో జిల్లావాసులను మండలి చైర్మన్ పదవి మూడుసార్లు వరించగా, అందులో ఇద్దరు నంద్యాలవారు ఉండడం గమనార్హం.
క్యాబినేట్‌లో ముస్లిం మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడంతో విపక్షాల విమర్శలకు సమాధానంగా ఫరూక్‌కు శాసనమండలి చైర్మన్ పదవి దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. 1950 మే 15వ తేదీ నంద్యాలలో నశ్యం కుటుంబంలో జన్మించిన ఫరూక్ ఇంటర్ వరకు చదువుకున్నారు. 1981లో కౌన్సిలర్‌గా ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ వెనువెంటనే నంద్యాల మున్సిపల్ కౌన్సిల్‌లో వైస్ చైర్మన్ పదవి ఆయనను వరించింది. 1982లో ఎన్‌టి రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు.
1985లో అసెంబ్లీ సీటు దక్కించుకున్న ఫరూక్ విజయం సాధించి వక్ఫ్, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 1990లో రామనాధరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గెలుపొంది శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన ఫరూక్ మున్సిపల్ శాఖ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తదనంతరం 13 సంవత్సరాల పాటు ఎలాంటి పదవులు లేకపోయినా పార్టీని అంటిపెట్టుకుని తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకుడుగా ఉండడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికకు ముందు ఫరూక్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. తాజాగా శాసనమండలి చైర్మన్‌గా ఎంపిక చేశారు.