ఆంధ్రప్రదేశ్‌

లోయలో పడిన జీపు: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, సెప్టెంబర్ 4: విశాఖ ఏజన్సీ చింతపల్లి మండలంలోని అన్నవరం సమీపంలో సోమవారం ప్రమాదవశాత్తు జీపు వాగులో బోల్తా పడింది. ఈ సంఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని అన్నవరం నుంచి తమ్మంగుల వెళ్ళే రహదారి మధ్యలో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నిర్మాణ పనులు కొట్టుకుపోవడంతో కొత్త వంతెన ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. వంతెనకు అటువైపు నుంచి ప్రైవేట్ వాహనాలు తమ్మంగుల వరకు నడుపుతున్నారు. సోమవారం అన్నవరం వారపుసంత జరిగింది. దోనిపొలాలకు చెందిన కొత్తూరు పెద్దమ్మి(26), సత్తిబాబు(30), పిల్లలు గుమ్మన్న(6), మూడేళ్ళపాప ఇటీవల జీలుగుమెట్ట వెళ్ళారు. సోమవారం ఇంటికి వెళ్ళేందుకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కర్ర వంతెన దాటుకుని జీపు వెనుక ఎక్కారు. మరో ఐదుగురు జీపు ముందు ఎక్కారు. డ్రైవర్ లగేజీని జీపుటాప్‌పై సర్దుతుండగా ముందు కూర్చున్న వ్యక్తి క్లచ్‌పై కాలుతో తొక్కాడు. దీంతో జీపు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయి వాగులో పడింది. ముందున్న వారందరూ దూకేసారు. వెనుక ఉన్న పెద్దమ్మి, ఇద్దరు పిల్లలు వాగులో పడి మృతి చెందారు. అయితే పెద్దమ్మి కుమార్తె మృత దేహం లభ్యమైనప్పటికీ కుమారుడు గుమ్మన్న మృతదేహం దొరకలేదు.