ఆంధ్రప్రదేశ్‌

త్వరలో ‘బాలామృతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 4: మూడేళ్లలోపు పసి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో త్వరలో ‘బాలామృతం’ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. ఈ పథకం కింద 7 నెలల నుంచి మూడేళ్లలోపు 14లక్షల 15వేల మంది పిల్లలకు నెలకు రెండున్నర కిలోల పౌష్టికారాన్ని అందిస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రతినెలా 22 కోట్ల నిధులు అవసరమవుతాయని, ఏడాదికి 264 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభింప చేస్తామని ప్రకటించారు. సోమవారం స్ర్తి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో 13 జిల్లాల ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సునీత మాట్లాడుతూ రాష్ట్రంలోని 7 లక్షల 40వేల మంది బాలింతల సంక్షేమానికి ఏటా రూ. 431 కోట్లతో ప్రభుత్వం ‘అన్న అమృతహస్తం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, అవకతవకలు జరక్కుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులను హెచ్చరించారు. రాష్టవ్య్రాప్తంగా ప్రతి ఐసిడిఎస్ ప్రాజెక్టు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అమృతహస్తం కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పథకం అమలులో సమస్యలు ఉత్పన్నమైతే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ పథకం కింద గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తారని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాల కొరత ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే వౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గర్భిణులు విధిగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనే భోజనం చేయాలన్నారు. దీనివల్ల వారి ఆరోగ్యానికి మంచిదని స్పష్టం చేశారు. పాలు, బియ్యం, గుడ్లు పంపిణీ జరిగే సమయంలో సిడిపిఒలు శ్రద్ధగా పరిశీలించి నాణ్యత లోపిస్తే తిప్పి పంపాలని సూచించారు. కేంద్రాలకు సకాలంలో సరకులు అందు తున్నాయా లేదా అనే విషయాలను పరిశీలించడంతో పాటు తూకంలో తేడాలు ఉంటే సంబంధిత ఏజన్సీలకు తెలియజేయాలన్నారు. గుడ్లు 45 గ్రాముల బరువు ఉండాలని, సరకు నాణ్యత బాధ్యత సిడిపిఒలే వహించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశు సంక్షేమం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో స్ర్తి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, వివిధ జిల్లాల పిడిలు, జోనల్ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..బాలామృతం పథకం పౌష్టికాహార బ్యాగ్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి సునీత